Surya Kumar Yadav Injury Update : వన్డే ప్రపంచకప్-2023లో న్యూజిలాండ్‌తో ఆడనున్న మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే గాయం కారణంగా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య కివీస్‌తో మ్యాచ్‌కు దూరం కాగా.. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కూడా గాయపడ్డారు. ధర్మశాలలోని హెచ్‌పీసీఎ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండగా ఇషాన్ కిషన్‌కు తేనెటీగ కుట్టగా.. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మణికట్టుకు గాయమైంది.
ప్రాక్టీస్ చేస్తుండగా బంతి.. సూర్య కుడి చేతి మణికట్టుకు బలంగా తాకినట్లు సమాచారం. వెంటనే మెడికల్ స్టాప్ ఐస్ ప్యాక్‌ను పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే సూర్య గాయంపై ఐస్‌ప్యాక్ పెట్టగా.. నొప్పి తగ్గినట్లు తెలుస్తోంది. ఎక్స్‌రే అవసరం లేదని సమాచారం.
-
ICC CWC 2023: Suryakumar Yadav injured during nets session ahead of New Zealand clash
— ANI Digital (@ani_digital) October 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/rWXKPljT87#INDvsNZ #cricket #TeamIndia #SuryakumarYadav #MeninBlue pic.twitter.com/aCEkoR0FOT
">ICC CWC 2023: Suryakumar Yadav injured during nets session ahead of New Zealand clash
— ANI Digital (@ani_digital) October 21, 2023
Read @ANI Story | https://t.co/rWXKPljT87#INDvsNZ #cricket #TeamIndia #SuryakumarYadav #MeninBlue pic.twitter.com/aCEkoR0FOTICC CWC 2023: Suryakumar Yadav injured during nets session ahead of New Zealand clash
— ANI Digital (@ani_digital) October 21, 2023
Read @ANI Story | https://t.co/rWXKPljT87#INDvsNZ #cricket #TeamIndia #SuryakumarYadav #MeninBlue pic.twitter.com/aCEkoR0FOT
Ishan Kishan Injury Update : కివీస్‌తో మ్యాచ్‌కు హార్దిక్ స్ధానంలో సూర్యకుమార్ యాదవ్ రానున్నట్లు వార్తలు వినిపించాయి. అంతలోనే సూర్యకు గాయం కావడం భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి. మరోవైపు తేనెటీగ కుట్టడం వల్ల నొప్పితో విల్లవిల్లాడిన కిషన్‌కు బీసీసీఐ వైద్య బృందం చికిత్స అందించింది. కంటి పైభాగంలో తేనెటీగ కుట్టడంతో బాగా ఉబ్బినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరికి సంబంధించి బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మరోవైపు, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే జడ్డూ గాయంపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. దీంతో టీమ్ఇండియా అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక హార్దిక్ స్ధానాన్ని ఎవరితో భర్తీ చేస్తారో మరో 24 గంటలు వేచి చూడాల్సిందే.
అయితే వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై టీమ్ఇండియాకు మెరుగైన రికార్డు లేకపోవడం కూడా అభిమానులను కలవరపెడుతోంది. 2003 వన్డే ప్రపంచకప్‌లో చివరిసారిగా న్యూజిలాండ్‌ను ఓడించిన భారత్.. తర్వాత జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే ఆదివారం జరగనున్న మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో మాదిరే రోహిత్ సేన కూడా ఓటమికి తలవంచుతుందా? లేక చరిత్రను తిరగరాస్తుందా? అనేది చూడాలి.
Ind Vs NZ World Cup : కివీస్‌తో కీలక పోరు.. ఈ ముగ్గురు మొనగాళ్లను అడ్డుకుంటారా ?