Shami World Cup Wickets : టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 5వికెట్లతో చెలరేగిపోయిన షమీ.. భారత్ తరఫున వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్‌లలో షమీ.. 45 వికెట్లు తీసుకున్నాడు. ఫలితంగా జహీర్ ఖాన్, జవగళ్ శ్రీనాథ్‌ల పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. వీరిద్దరూ ప్రపంచకప్‌ల్లో 44 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉన్నారు. అయితే, ఈ టోర్నీలో ఇప్పటివరకు కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన షమీ.. ఏకంగా 14 వికెట్లు పడగొట్టాడు. అందులో రెండు ఫైవ్ వికెట్లు హాల్, ఒక నాలుగు వికెట్ల హాల్ ఉంది. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 5 ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ.. కేవలం 18 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అందులో ఒక మెయిడిన్ కూడా ఉంది.
రోహిత్ శర్మ హర్షం
శ్రీలంకపై ఘన విజయం సాధించి.. సెమీస్‌లోకి ప్రవేశించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ. జట్టు సమష్టి కృషితోనే సాధ్యమైందని చెప్పాడు. శ్రేయస్ అయ్యర్ ఆత్మవిశ్వాసంతో ఆడాడని.. తన నుంచి మేము ఎలాంటి ఇన్నింగ్స్ కోరుకున్నామో అదే చేసి చూపించాడని ప్రశంసించాడు.
"మేము ప్రస్తుతం అధికారికంగా సెమీఫైనల్లో అడుగుపెట్టాం. చెన్నై నుంచి మొదలుపెడితే ఇప్పటి దాకా.. మా జట్టు సమష్టి కృషితో అద్భుత ప్రదర్శన చేస్తూ ముందుకు సాగుతోంది. సెమీస్‌లో మేమే తొలుత అడుగుపెట్టాలన్న తొలి లక్ష్యం నెరవేరింది. ఫైనల్ విషయంలోనూ మా టార్గెట్ అదే. ఈ ఏడు మ్యాచ్‌లలో మా ప్రదర్శన అత్యద్భుతం. జట్టులోని ప్రతి ఆటగాడు తన వంతు పాత్ర పోషించాడు. అంతా కలిసికట్టుగా ఇక్కడిదాకా చేరుకున్నాం."
--రోహిత్ శర్మ, కెప్టెన్
సెమీఫైనల్లో భారత్
ముంబయిలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో 302 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది భారత్. ఈ విజయంతో సెమీఫైనల్స్‌కు ఆర్హత సాధించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకను 55 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో షమీ నాలుగు వికెట్లు తీయగా.. సిరాజ్ మూడు, బుమ్రా, జడేజా ఒక్కొ వికెట్ తీశారు.
అదరగొట్టిన షమీ, చిత్తుగా ఓడిన శ్రీలంక- రికార్డ్ విజయంతో సెమీస్‌లోకి భారత్
మ్యాచ్‌లో ముగ్గురు మొనగాళ్ల జోరు- శ్రీలంకకు రోహిత్ సేన టార్గెట్ ఫిక్స్!