Rohit Sharma World Cup 2023 : అఫ్గానిస్థాన్‌పై అద్భుతమైన శతకంతో చెలరేగిన టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మతో బౌలర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని పాక్ మాజీలు హెచ్చరించారు. ప్రపంచకప్‌లో భాగంగా భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య నేడు(అక్టోబర్ 13)న హోరా హోరీ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో తమ బౌలర్లకు కీలక సూచనలు చేసిన మాజీ ఆటగాళ్లు మిస్బా ఉల్ హక్, వసీమ్ అక్రమ్ రోహిత్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అలవోకగా పరుగులు చేస్తున్నాడు. ఎలాంటి రిస్క్ లేకుండానే అద్భుత షాట్లు కొట్టేస్తున్న అతనికి బౌలింగ్ చేసేటప్పుడు బౌలర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కోహ్లీ కూడా వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించి ఊపు మీద ఉన్నాడు. బంతిపై పూర్తి నియంత్రణతో ఆడుతున్నాడు. అయితే, కోహ్లీ కంటే రోహిత్ విభిన్న తరహా బ్యాటర్. ఇతర బ్యాటర్ల కంటే బంతిని ఎదుర్కోవడానికి రోహిత్ వద్ద అదనపు సమయం ఉన్నట్లు అనిపిస్తుంది" అని వసీమ్ అక్రమ్ పేర్కొన్నాడు.
"రోహిత్ శర్మ అఫ్గాన్‌పై ఇలాంటి భారీ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ఇతర జట్లు ఒత్తిడికి గురి కావడం మామూలే. అయితే అతడికి బౌలింగ్ ఎక్కడ వేయాలనే దానిపై తీవ్ర కసరత్తు చేయాల్సిందే" అని మిస్బా అన్నాడు. 'ఈ మ్యాచ్‌లో మీరు ఎలా అతడి దాడిని తట్టుకుంటారు? అని వసీమ్ అక్రమ్ ప్రశ్నకు సమాధానంగా.. "పాక్ బౌలింగ్ బలంగానే ఉంది.. మ్యాచ్ రసవత్తరంగా ఉంటుందని భావిస్తున్నాను' అని రిప్లై ఇచ్చాడు.
'పాక్‌కు ఆ ఛాన్స్ ఉంది'
Ind Vs Pak World Cup 2023 : భారత్-పాకిస్థాన్ పోరులో ఎవరు గెలుస్తారనే విషయంపై గురించి విశ్లేషకులు చర్చిస్తున్నారు. ఆయా దేశాల మాజీలు కూడా తమ జట్టుకే విజయావకాశాలు ఉన్నాయంటూ చెబుతున్నారు. ఈ క్రమంలో పాక్ మాజీ దిగ్గజం రమీజ్ రజా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత జట్టును ఫేవరెట్ అని చెప్పిన రమీజ్ .. పాక్‌కు కూడా అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించాడు. "దాయాదుల మధ్య పోరు భారీగానే ఉంటుంది. అయితే ఇక్కడ భారత్ ఫేవరెట్ అనడంలో ఏ మాత్రం అనుమానం లేదు. మూడు విభాగాల్లోనూ పటిష్ఠంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ చక్కటి ప్రదర్శన చేస్తోంది. అయితే, పాకిస్థాన్ కూడా విజయం సాధించేందుకు అవకాశం ఉంది. శ్రీలంకపై భారీ లక్ష్యఛేదన చేసిన తర్వాత పాక్ జట్టులోనూ ఆత్మవిశ్వాసం పెరిగింది" అని రమీజ్ రజా తెలిపాడు.
ODI World Cup 2023 IND VS AFG : రోహిత్ సెన్సేషనల్ సెంచరీ... టీమ్ఇండియా వరుసగా రెండో విజయం