PAK vs BAN WORLD CUP 2023 : 2023 వరల్డ్‌కప్‌లో భాగంగా మంగళవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 204 పరుగులు చేసి కుప్ప కూలింది. 205 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన.. మొదటి నుంచీ నిలకడగా ఆడుతూ 32.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. ఓపెనర్లు అబ్దుల్ షఫీక్ (68), ఫకర్ జమాన్ (81) చెలరేగి ఆడి జట్టు మంచి ఆరంభాన్నిచ్చారు. వన్‌డౌన్ వచ్చిన బాబర్ అజామ్ (9) పరుగులకే పెవిలియన్ చేరాడు. మహ్మద్ రిజ్వాన్ (26*), ఇఫ్తికర్ అహ్మద్ (17*) పరుగులు చేశారు. ఇక బంగ్లా బౌలర్లలో మెహెదీ హసన్ మిరాజ్ 3 వికెట్లు తీశాడు.
-
Pakistan overcame a modest Bangladesh total with ease to garner their third #CWC23 win 💪#PAKvBAN 📝: https://t.co/059IGB6Iku pic.twitter.com/Pq7IHBuUp4
— ICC Cricket World Cup (@cricketworldcup) October 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Pakistan overcame a modest Bangladesh total with ease to garner their third #CWC23 win 💪#PAKvBAN 📝: https://t.co/059IGB6Iku pic.twitter.com/Pq7IHBuUp4
— ICC Cricket World Cup (@cricketworldcup) October 31, 2023Pakistan overcame a modest Bangladesh total with ease to garner their third #CWC23 win 💪#PAKvBAN 📝: https://t.co/059IGB6Iku pic.twitter.com/Pq7IHBuUp4
— ICC Cricket World Cup (@cricketworldcup) October 31, 2023
అంతకుముందు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు.. 45.1 ఓవర్లలో 204 పరుగులకు కుప్పకూలింది. మహ్మదుల్లా (56; 79 బంతుల్లో 6x4, 1x6) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లిట్టన్ దాస్ (45; 64 బంతుల్లో 6x4), షకీబ్ అల్ హసన్ (43; 64 బంతుల్లో 4x4) రాణించారు. మెహది హసన్ మిరాజ్ (25) పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. తాంజిద్ హసన్ (0), నజ్ముల్ హొస్సేన్ శాంటో (4), ముష్పీకర్ రహీమ్ (5), తౌహిద్ హృదౌయ్ (7), ముఫ్తికర్ రెహ్మాన్ (3) సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, మహ్మద్ వసీమ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. హారిస్ రవూఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఉసామా మీర్, ఇఫ్తికార్ అహ్మద్ తలో వికెట్ తీశారు.
విమర్శల మధ్య మూడో విజయం..
ప్రస్తుత వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక పాక్ క్రికెట్లో ముసలం మొదలైంది. ఈ క్రమంలో పాక్ మూడో విజయం సొంతం చేసుకుంది. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన పాక్.. మూడింట్లో గెలిచి పాయంట్ల పట్టిలో ఐదో స్థానంలో నిలిచింది.