ETV Bharat / sports

ODI World Cup 2023 : 'భారత్‌ను ఓడించడం కత్తిమీద సామే.. కానీ రోహిత్​ ఉంటే మాత్రం..' - రికీ పాంటింగ్​ వరల్డ్ కప్​ 2023

ODI World Cup 2023 : ప్రపంచ కప్​లో భాగంగా జరుగుతున్న మ్యాచ్​లతో టీమ్ఇండియా హ్యాట్రిక్​ విజయం సాధించడం పట్ల ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ కొనియాడాడు. వ్యాఖ్యానించాడు. భారత్‌ను ఓడించడమంటే ఇతర జట్లకు చాలా కష్టమని రికీ పేర్కొన్నాడు.

Rohit Sharma World Cup 2023
Rohit Sharma World Cup 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2023, 5:07 PM IST

ODI World Cup 2023 : వన్డే ప్రపంచ కప్‌లోలో హ్యాట్రిక్‌ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టీమ్​ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. ఆసీస్‌పై అద్భుత పోరాటంతో గెలిచిన టీమ్‌ఇండియా.. ఆ తర్వాత అఫ్గాన్‌, పాక్‌ జట్లను అలవోకగా చిత్తు చేసింది. దీంతో అందరి దృష్టి ఇప్పుడు టీమ్ఇండియాపై పడింది. అయితే తాజాగా టీమ్ఇండియా గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ వ్యాఖ్యానించాడు. భారత్‌ను ఓడించడమంటే ఇతర జట్లకు చాలా కష్టమని రికీ పేర్కొన్నాడు.

"వరల్డ్‌ కప్ ప్రారంభానికి ముందు నుంచే నేను చెబుతున్నాను. భారత్‌ను ఓడించడమంటే చాలా కష్టం అని. అద్భుతమైన ఆటగాళ్లతో ఆ జట్టు బరిలోకి దిగింది. అన్ని విభాగాలను పటిష్ఠంగా మలుచుకుంది. ఫాస్ట్‌, స్పిన్‌ బౌలింగ్‌ గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాప్‌ ఆర్డర్‌, మిడిలార్డర్‌ కూడా బలంగా ఉంది. అందుకే, వారిని ఎదుర్కోవడం ఎలాంటి జట్టుకైనా కత్తిమీద సామే. అయితే, వరల్డ్‌ కప్‌ ముగింపు నాటికి ఉండే తీవ్ర ఒత్తిడిని తట్టుకుని ఇదే ఊపును భారత్‌ ఎలా కొనసాగిస్తుందో వేచి చూడాలి. ఆ ఒత్తిడిని అధిగమించడమే వారికి ఇప్పుడు కీలకంగా మారనుంది" అని పాంటింగ్‌ తెలిపాడు.

'అతని వల్లే విరాట్​ అలా ఆడుతున్నాడు'
Rohit Sharma Ricky Ponting : ఇక ఇదే వేదికగా టీమ్ఇండియా కెప్టెన్​ రోహిత్ శర్మను​ రికీ పాంటింగ్​ కొనియాడాడు. అతని నాయకత్వంలో టీమ్ఇండియా కచ్చితంగా విజేతగా నిలిచే అవకాశాలున్నాయని రికీ అన్నాడు.

"రోహిత్ ఆడుతున్న తీరును ఓసారి పరిశీలిస్తే జట్టుకు అతడు ఎంత బలంగా మారాడో ఇట్టే అర్థమైపోతుంది. బ్యాటింగ్‌లో అదరగొడుతూనే జట్టును సమష్టిగా ముందుండి నడిపిస్తున్న తీరు అద్భుతం. అయితే, టోర్నీ ముందుకు సాగే కొద్దీ ఒత్తిడి వారిపై ఉండదని నేను చెప్పడం లేదు. కానీ, దాన్ని తొలుత అతడే తీసుకుని మిగతా వారూ ఎదుర్కొనేలా సిద్ధంగా ఉంచుతాడు. ఇలా రోహిత్ అద్భుత నాయకత్వంతో విరాట్ వంటి ప్లేయర్లకు మరింత స్వేచ్ఛ లభిస్తోంది. దీంతో కేవలం తమ బ్యాటింగ్‌పైనే దృష్టిపెట్టేందుకు ఆస్కారం లభించినట్లైంది. తప్పకుండా రోహిత్ సారథ్యంలో భారత్‌ విజేతగా నిలిచేందుకు అవకాశాలున్నాయి" అని రికీ పాంటింగ్‌ విశ్లేషించాడు.

Rohit Sharma ODI Record : మెగాటోర్నీలో రోహిత్ పరుగుల మోత.. బద్దలైన ఆసీస్ దిగ్గజం రికార్డ్​

Captains With Highest Trophies : ధోనీ టు రిక్కీ.. వీళ్లంతా ట్రోఫీ కింగ్స్.. ​ఒకటి కాదు రెండు కాదు ఏకంగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.