IND Vs SA World Cup 2023 Records : 2023 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎదురులేకుండా దూసుకుపోతోంది. వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచి సత్తా చాటింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అటు బ్యాట్‌తో ఇటు బంతిలో అద్భుత విన్యాసాలు చేశారు భారత ప్లేయర్లు. పుట్టినరోజు నాడు సెంచరీ కొట్టి అభిమానులకు స్పెషల్ కానుక ఇచ్చిన కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్‌గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ సరసన నలిచాడు. మరోవైపు టీమ్ఇండియా డేరింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లు కూడా అద్భుతమైన ఫీట్లు సాధించారు.
-
The Indian juggernaut rolls on in Kolkata 🔥#CWC23 | #INDvSA 📝: https://t.co/5LhBnOZ6r3 pic.twitter.com/x1ktmGFGee
— ICC Cricket World Cup (@cricketworldcup) November 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Indian juggernaut rolls on in Kolkata 🔥#CWC23 | #INDvSA 📝: https://t.co/5LhBnOZ6r3 pic.twitter.com/x1ktmGFGee
— ICC Cricket World Cup (@cricketworldcup) November 5, 2023The Indian juggernaut rolls on in Kolkata 🔥#CWC23 | #INDvSA 📝: https://t.co/5LhBnOZ6r3 pic.twitter.com/x1ktmGFGee
— ICC Cricket World Cup (@cricketworldcup) November 5, 2023
6 వేల పరుగుల ఆల్‌రౌండర్..!
ఆదివారం సఫారీలతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి వీర విహారం చేసిన రవీంద్ర జడేజా.. 193 స్ట్రైక్ రేట్‌తో 15 బంతుల్లో 29* (3x4, 1x6) పరుగులు చేశాడు. ఆదివారం మ్యాచ్ సహా 325 మ్యాచ్‌లు ఆడిన జడేజా.. అంతర్జాతీయ క్రికెట్లో 6 వేల (6,008) పరుగులు పూర్తి చేసుకున్నాడు. 33.37 సగటు, 70పైగా స్ట్రైక్ రేట్‌తో ఈ ఫీట్ సాధించాడు.
-
Ravindra Jadeja sizzles under the lights to garner a splendid five-wicket haul ⚡@mastercardindia Milestones 🏏#CWC23 | #INDvSA pic.twitter.com/3Qy6nesaVD
— ICC Cricket World Cup (@cricketworldcup) November 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ravindra Jadeja sizzles under the lights to garner a splendid five-wicket haul ⚡@mastercardindia Milestones 🏏#CWC23 | #INDvSA pic.twitter.com/3Qy6nesaVD
— ICC Cricket World Cup (@cricketworldcup) November 5, 2023Ravindra Jadeja sizzles under the lights to garner a splendid five-wicket haul ⚡@mastercardindia Milestones 🏏#CWC23 | #INDvSA pic.twitter.com/3Qy6nesaVD
— ICC Cricket World Cup (@cricketworldcup) November 5, 2023
కుల్దీప్ యాదవ్@250
కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 5.1 ఓవర్లలో కేవలం 7 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో 250 వికెట్లు పూర్తి చేసుకుని.. అత్యధిక వికెట్లు తీసిన భారతీయుల జాబితాలో 19వ స్థానంలో నిలిచాడు. 138 మ్యాచ్‌ల్లో 22.62 సగటుతో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో మొదటి స్థానంలో 953 వికెట్లతో అనిల్ కుంబ్లే మొదటి స్థానంలో ఉన్నాడు.
-
From one Master to another 🤝#CWC23 pic.twitter.com/ezCXOJuJhh
— ICC Cricket World Cup (@cricketworldcup) November 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">From one Master to another 🤝#CWC23 pic.twitter.com/ezCXOJuJhh
— ICC Cricket World Cup (@cricketworldcup) November 5, 2023From one Master to another 🤝#CWC23 pic.twitter.com/ezCXOJuJhh
— ICC Cricket World Cup (@cricketworldcup) November 5, 2023
ఈ మ్యాచ్‌లో భారత ప్లేయర్లు నమోదైన రికార్డులు..
- వరల్డ్‌కప్‌లో విరాట్ ఇప్పటివరకు 34 మ్యాచ్‌ల్లో కలిపి.. 1573 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సచిన్ (2278), రికీ పాంటింగ్ (1743), మాత్రమే విరాట్ కంటే ముందున్నారు.
- సౌతాఫ్రికాపై అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా సచిన్ (5)ను విరాట్ సమం చేశాడు. అయితే సచిన్ 57 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించగా.. విరాట్ 31 మ్యాచ్‌ల్లోనే అందుకున్నాడు.
- స్వదేశంలో వన్డేల్లో విరాట్ 6000+ పరుగులు నమోదు చేశాడు. ఈ జాబితాలో విరాట్ (6046) కంటే ముందు.. సచిన్ (6796) మాత్రమే ఉన్నాడు. వీరిద్దరి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ (4590) మూడో స్థానంలో ఉన్నాడు.
- వరల్డ్ కప్‌ల్లో 1500 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో భారతీయుడిగా కోహ్లీ నిలిచాడు. మొదటి స్థానంలో సచిన్ ఉన్నాడు.
- ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక వన్డే సిక్సర్లు (58)బాదిన దక్షిణాఫ్రికా ఆటగాడు ఎబీ డివిలియర్స్ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు.
సునీల్ నరైన్ షాకింగ్ డెసిషన్ - ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై
సఫారీలనూ చిత్తు చేసిన టీమ్ఇండియా - జడ్డూ మ్యాజిక్కు సౌతాఫ్రికా విలవిల