ETV Bharat / sports

అన్ని విభాగాల్లో దుర్భేధ్యంగా టీమ్ఇండియా- వెంటాడుతున్న సెమీస్‌ ఫోబియా! - భారత్ వర్సెస్ న్యూజిలాండ్ 2023 సెమీ ఫైనల్​

IND Vs NZ World Cup 2023 Semi Final Review : ప్రపంచకప్‌ లీగ్‌ దశలో పరాజయమే లేకుండా సెమీఫైనల్‌కు చేరుకున్న టీమ్​ఇండియా.. కీలక పోరుకు సిద్ధమైంది. ముంబయిలోని వాంఖడే వేదికగా.. న్యూజిలాండ్‌తో ఫైనల్‌ బెర్త్‌ కోసం అమీతుమీ తేల్చుకోనుంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న రోహిత్ సేన.. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించడం ఖాయమన్న అంచనాలు ఉన్నా.. సెమీస్‌ ఫోబియా అభిమానులను కలవరపెడుతోంది. ఐసీసీ టోర్నీల్లో భారత్‌పై కివీస్‌కు ఘనమైన రికార్డు ఉన్నా.. ఈ మ్యాచ్‌తో వాటన్నింటినీ పటాపంచలు చేయాలని భారత్ పట్టుదలగా ఉంది. గత ప్రపంచకప్‌ సెమీస్‌లో.. ఎదురైన పరాభవానికి ఈ సెమీస్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్‌ సేన కసిగా ఉంది.

IND Vs NZ World Cup 2023 Semi Final Review

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2023, 3:39 PM IST

Updated : Nov 14, 2023, 4:08 PM IST

IND Vs NZ World Cup 2023 Semi Final Review : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌.. తుదిదశకు చేరుకుంది. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో నాకౌట్‌ మ్యాచ్‌కు టీమ్​ఇండియా సిద్ధమైంది. ఈ మహా సంగ్రామంలో వరుస విజయాలతో ఊపు మీదున్న రోహిత్‌ సేన.. అదే ఊపుతో కివీస్‌ను ఓడించాలని భావిస్తోంది. బ్యాటింగ్‌ విభాగంలో బ్యాటర్లు అదరగొడుతుండగా.. బౌలర్లు పదునైన పేస్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను బెదరగొడుతున్నారు. స్పిన్నర్లు బ్యాటర్లను కట్టడి చేస్తుండగా.. ఫీల్డర్లు మైదానంలో చురుగ్గా కదులుతున్నారు. ఇలా ఏ విభాగంలో చూసినా టీమ్​ఇండియా చాలా పటిష్ఠంగా కనిపిస్తోంది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగనున్న రోహిత్‌ సేన 2019 ప్రపంచకప్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది.

ఈ ప్రపంచకప్‌ను భారత్‌ సాధిస్తుందన్న అంచనాలు భారీగా ఉండడం వల్ల.. ఆ ఒత్తిడిని టీమ్​ఇండియా అధిగమించాల్సి ఉంది. జట్టు సభ్యులను ఈ ఒత్తిడి నుంచి దూరంగా ఉంచడంపై.. కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్ దృష్టి సారించారు. వాంఖడే పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందన్న.. అంచనాలు ఉన్నాయి. భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుని భారీ స్కోరు చేస్తే సగం విజయం సాధించినట్లేనని.. మాజీలు అంచనా వేస్తున్నారు. వాంఖడేలో ఫ్లడ్‌ లైట్ల వెలుగుల్లో లక్ష్యాన్ని ఛేదించాల్సి రావడం.. కష్టంగా మారనుంది. కొత్త బంతితో తీవ్ర నష్టాన్ని కలిగించే బౌలర్లు.. ఇరు జట్లలోనూ ఉన్నారు.

రోహిత్‌ శర్మ మరోసారి రాణిస్తే టీమ్​ఇండియాకు ఇక ఎదురుండదు. ఇప్పటికే ఈ ప్రపంచ కప్‌లో రోహిత్ 503 పరుగులు.. గిల్‌ 270 పరుగులు చేశారు. మీరు మరోసారి విధ్వంసకర ఓపెనింగ్‌ ఇస్తే భారత్‌ గెలుపు ఖాయమవుతుంది. విరాట్ కోహ్లీ కూడా ఈ టోర్నీలో 593 పరుగులు చేసి సచిన్‌ రికార్డును అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నాడు. కె.ఎల్. రాహుల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజాలతో బ్యాటింగ్‌ దుర్భేద్యంగా ఉంది. టీమ్ఇండియా బౌలింగ్‌ విభాగం కూడా.. పటిష్ఠంగా ఉంది. బుమ్రా, సిరాజ్‌, షమీ అదరగొడుతున్నారు. కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా కూడా సత్తా చాటుతున్నారు.

సెమీస్‌కు చేరిన న్యూజిలాండ్‌ కూడా.. పటిష్టంగానే కనిపిస్తోంది. యువ ఆటగాడు భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర ఈ ప్రపంచకప్‌లో 565 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. డెవాన్ కాన్వే కూడా.. పర్వాలేదనిపిస్తున్నాడు. కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్‌లతో మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్, స్పిన్నర్ మిచెల్ శాంట్నర్‌లతో కివీస్‌ బౌలింగ్‌ కూడా బలంగా ఉంది.

India Vs New Zealand Semi Final 2019 : ఐసీసీ టోర్నమెంట్‌లలో భారత్‌-న్యూజిలాండ్‌ మొత్తం 14 సార్లు తలపడగా కివీస్‌ 9 సార్లు, భారత్‌ నాలుగుసార్లు గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. 2000 నుంచి ఐసీసీ టోర్నీల్లో మూడు నాకౌట్ మ్యాచ్‌ల్లో కివీస్‌ చేతిలో టీమ్​ఇండియా ఓటమిపాలైంది. కానీ ప్రస్తుత ప్రపంచకప్‌లో లీగ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి జోరుమీదుంది. భారత్‌ సునామీలో కివీస్ జట్టు గల్లంతు కావడమే మిగిలింది. 2011, 2015,2019 వన్డే ప్రపంచకప్‌లలో ఆతిథ్య జట్టే విజేతగా నిలుస్తూ వచ్చింది. ఈసారి కూడా అదే ఆనవాయితీ పునరావృతం కావాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.

బ్యాటర్ల జోరా? వికెట్ల హోరా? సెమీస్ జరిగే వేదికలు ఎవరికి అనుకూలం?

రూ2వేల టికెట్ రెండున్నర లక్షలకు- సెమీస్ క్రేజ్​ను క్యాష్ చేసుకుందామని అడ్డంగా దొరికి!

Last Updated : Nov 14, 2023, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.