ETV Bharat / sports

Ind Vs Eng World Cup 2023 : షమీ మెరుపులు.. ఇంగ్లాండ్​పై టీమ్ఇండియా ఘన విజయం

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2023, 9:22 PM IST

Updated : Oct 29, 2023, 9:52 PM IST

Ind Vs Eng World Cup 2023 : ఆదివారం లఖ్‌నవూలోని ఏకనా స్టేడియం వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో 100 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. వరుసగా ఆరు మ్యాచ్​లు గెలిచి నాకౌట్‌ బెర్తును ఖారారు చేసుకుంది

Ind Vs Eng World Cup 2023
Ind Vs Eng World Cup 2023

Ind Vs Eng World Cup 2023 : 2023 వరల్డ్​కప్​లో భాగంగా ఆదివారం లఖ్​నవూలోని ఏకనా స్టేడియంలో ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్ఇండియా అద్భుత విజయం సాధించి నాకౌట్‌ బెర్తును ఖారారు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్​ ​ 229 పరుగులు చేయగా.. ఛేదనలో ఇంగ్లాండ్​ 129 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 100 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇంగ్లాండ్​ బ్యాటర్లలో ఏ ఒక్కరూ భారీ స్కోర్‌ చేయలేకపోయారు. లివింగ్‌స్టోన్ (27) టాప్‌ స్కోరర్​గా నిలిచాడు. జానీ బెయిర్‌స్టో (14), డేవిడ్ మలన్ (16) పరుగులు చేయగా.. జో రూట్ (0), బెన్‌స్టోక్స్ (0) డౌకౌట్​ అయ్యారు. వీరే కాకుండా జోస్ బట్లర్ (10), మొయిన్ అలీ (15), క్రిస్‌వోక్స్ (10) తక్కువ పరుగులకో వరుసగా పెవిలియన్‌కు చేరారు. భారత బౌలర్లలో షమి (4/22), బుమ్రా (3/32), కుల్‌దీప్ యాదవ్‌ (2/24) ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. జడేజా ఒక వికెట్‌ పడగొట్టాడు. ఈ విజయంతో భారత్​.. పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. అటు ఇంగ్లాండ్​ 2 పాయింట్లతో పాయింట్స్​ టేబుల్​లో అట్టడుగు స్థానంలో ఉంది.

రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్..
అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. టాప్‌ ఆర్డర్‌లో శుభ్‌మన్ గిల్ (9), విరాట్ కోహ్లీ (0), శ్రేయస్ అయ్యర్ (4) విఫలమయ్యారు. కానీ రోహిత్ శర్మ (87; 101 బంతుల్లో 10x4, 3x6) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి కాస్తలో సెంచరీ మిస్​అయ్యాడు. మరో బ్యాటర్ కేఎల్ రాహుల్ (39; 58 బంతుల్లో 3x4) రాణించాడు. రవీంద్ర జడేజా (8) విఫలమయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ (49; 47 బంతుల్లో 4x4, 1x6) త్రుటిలో అర్ధ శతకం చేజార్చుకున్నాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ 3 వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్ ఒక వికెట్ పడగొట్టాడు.

Rohit Sharma Records List : రోహిత్ ఖాతాలో రెండు అరుదైన రికార్డులు.. ఆ ఘనత సాధించిన ఏడో కెప్టెన్​గా..

Dhoni Tip For Bachelors : బ్యాచిలర్లకు కెప్టెన్​ కూల్​ సలహా.. ఆ ఒక్క స్పీచ్​తో ఫ్యాన్స్​ ఫిదా!

Last Updated : Oct 29, 2023, 9:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.