ETV Bharat / sports

'గెలిచినా ఓడినా మీవెంటే!'- టీమ్ఇండియా ఓటమిపై ప్రధాని మోదీ

Ind vs Aus World Cup Final 2023
Ind vs Aus World Cup Final 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 19, 2023, 12:31 PM IST

Updated : Nov 19, 2023, 10:42 PM IST

22:37 November 19

వరల్డ్ కప్​ ఫైనల్​లో టీమ్ఇండియా ఓటమిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఎప్పుడైనా మీవెంటే ఉంటామని చెప్పారు. 'డియర్​ టీమ్ఇండియా, ప్రపంచకప్‌లో మీ ప్రతిభ, సంకల్పం మర్చిపోలేనివి. మీరు గొప్ప స్ఫూర్తితో ఆడారు. దేశం గర్వపడేలా చేశారు. ఈరోజు, ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాం' అని మోదీ ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

22:17 November 19

భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్‌ మార్లెస్‌ ఇద్దరు కలిసి ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా జట్టుకు అందించారు. ఆ జట్టు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ప్రపంచకప్‌ను అందుకున్నారు.

21:05 November 19

హోరాహోరీగా సాగిన 2023 వరల్డ్​ కప్​ ఫైనల్ సమరంలో టీమ్​ఇండియా పోరాడి ఓడింది. అటు బౌలింగ్​లో ఇటు బ్యాటింగ్​లో రాణించిన ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్​ కప్​ టైటిల్ సాధించింది. ఫైనల్​లో ఇండియాపై 6 వికెట్ల తేడాతో గెలిచింది. భారత్​ నిర్దేశించిన 241 పరుగులు లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 43 ఓవర్లలోనే ఛేదించింది.

20:43 November 19

ట్రావిస్​ హెడ్‌ సెంచరీ చేశాడు. 95 బంతుల్లో 100 పరుగులు బాదాడు.

20:39 November 19

భారత ప్రధాని నరేంద్ర మోదీ.. వరల్డ్​ కప్​ ఫైనల్​ జరుగుతున్న స్టేడియం వద్దకు చేరుకున్నారు.

20:34 November 19

నిలకడగా ఆసీస్​ బ్యాటింగ్​. 32 ఓవర్లలో స్కోరు 172/3

20:07 November 19

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్​ సగం ఓవర్లు పూర్తయ్యాయి. ఈ సమయానికి 3 వికెట్లు కోల్పోయిన ఆసీస్​ 135 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్ (65), లబుషేన్​ (26) ఉన్నారు.

19:48 November 19

ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మార్ష్​(14), ట్రావిస్ హెడ్ (43) ఉన్నారు.

18:59 November 19

ఆసీస్​ మూడో వికెట్ కోల్పోయింది. స్టీవ్​ స్మిత్​ (4) పరుగులకే ఔట్ అయ్యాడు.

18:47 November 19

రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా. మిచెల్ మార్ష్​ (15) పరుగులకు ఔట్ అయ్యాడు. బుమ్రా వేసిన ఐదో ఓవర్‌లో మూడో బంతికి కేఎల్ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. 5 ఓవర్లకు స్కోరు 41/2. హెడ్ (8), స్టీవ్ స్మిత్ (0) క్రీజులో ఉన్నారు.

18:30 November 19

మొదటి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా. షమీ బౌలింగ్​లో డేవిడ్​ వార్నర్​ (7) పరుగులకు ఔట్​ అయ్యాడు.​

షమి వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో తొలి బంతికి కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చాడు.

17:47 November 19

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్​ కప్​ ఫైనల్‌లో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్​కు 241 పరుగులు టార్గెట్ ఇచ్చింది. కుల్‌దీప్‌ యాదవ్ (10) ఇన్నింగ్స్‌ చివరి బంతికి రనౌట్ అయ్యాడు.

టాస్​ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమ్ఇండియా మొదటి నుంచి తడబడుతూ వచ్చింది. ఓపెనర్ శుభ్​మన్ గిల్ (4) పరుగులకే ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (47) పరుగులు చేసి త్రుటిలో హాఫ్​ సెంచరీ మిస్ అయ్యాడు. అయితే కొద్ది సేపు రోహిత్​తో విరాట్​ కోహ్లీ (54) బ్యాటు ఝుళిపించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ (66) క్రీజులో నిలకడగా ఆడి భారత్​ స్కోరును పరుగెత్తించాడు. ఇక అనంతరం బ్యాటింగ్​కు దిగిన రవీంద్ర జడేజా (9), సూర్య (18), షమీ (6), బుమ్రా (1), కుల్దీప్ యాదవ్ (10), సిరాజ్​ తేలిపోయారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్​ స్టార్క్​ మూడు వికెట్లు తీయగా.. హెజిల్​వుడ్, ప్యాట్ కమిన్స్​ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక మ్యాక్స్​వెల్, ఆడమ్​ జంపా తలో వికెట్ తీశారు.

17:40 November 19

టీమ్ఇండియా తొమ్మిదో వికెట్​ కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ (18) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

17:26 November 19

టీమ్ఇండియా వికెట్లు వరుసగా కూలుతున్నాయి. ఎనిమిదో వికెట్​ కోల్పోయిన టీమ్ఇండియా 44.5 ఓవర్లలో 214 పరుగులు చేసింది.

17:21 November 19

టీమ్ఇండియా ఏడో వికెట్ కోల్పోయింది. మహ్మద్ షమీ (6) పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

17:11 November 19

టీమ్ఇండియా ఆరో వికెట్ కోల్పోయింది. కేఎల్​ రాహుల్ (66) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్​ యాదవ్ (10), షమీ ఉన్నారు.

17:05 November 19

టీమ్ఇండియా 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం క్రీజులో సూర్య కుమార్​ యాదవ్ (9), కేఎల్ రాహుల్(66) ఉన్నారు.

16:43 November 19

టీమ్ఇండియా అభిమానుల నిరాశకు ఎదురైంది. రవీంద్ర జడేజా (9) పరుగులకే ఔటయ్యాడు.

16:36 November 19

కేఎల్​ రాహుల్​ (50; 86 బంతుల్లో) హాఫ్​ సెంచరీ చేశాడు. జడేజా (9) పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం ఇండియా 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.

16:05 November 19

టీమ్ఇండియా అభిమానుల నిరాశకు ఎదురైంది. విరాట్ కోహ్లీ (54) ఔటయ్యాడు. ప్యాట్​ కమిన్స్‌ వేసిన 29 ఓవర్‌లో మూడో బంతికి బౌల్డ్ అయ్యాడు. రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. కేఎల్​ రాహుల్ (37) పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు.

15:53 November 19

విరాట్​ కోహ్లీ (50; 56 బంతుల్లో) హాఫ్​ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం విరాట్​తో పాటు శ్రేయస్ అయ్యర్ (25) క్రీజులు ఉన్నాడు. టీమ్​ఇండియా నిలకడగా పరుగులు చేస్తోంది. ప్రస్తుత స్కోరు 132/3

15:32 November 19

20 ఓవర్లు పూర్తయ్యే సరికి ఇండియా 3 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజలో విరాట్​ కోహ్లీ(39), కేఎల్ రాహుల్ (19) ఉన్నారు.

15:12 November 19

టీమ్ఇండియా 3 వికెట్ల నష్టానికి 100 పరుగులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం క్రీజలో విరాట్​ కోహ్లీ(34), కేఎల్ రాహుల్ (9) ఉన్నారు.

14:48 November 19

టీమ్​ఇండియాకు మరో బిగ్​ షాక్​ తగిలింది. బ్యాటర్ శ్రేయస్ అయ్యర్​​(4) ఔటయ్యాడు. కిమిన్స్ బౌలింగ్​లో షాట్​ ఆడటానికి ప్రయత్నించి జోష్​ ఇంగ్లిస్​కు క్యాచ్​ ఇచ్చాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్​ కోహ్లీ(24), కేఎల్ రాహుల్ (2) ఉన్నారు.

14:21 November 19

టీమ్​ఇండియాకు బిగ్​ షాక్​ తగిలింది. ఓపెనర్​ శుభమన్​ గిల్​(4) ఔటయ్యాడు. స్టార్క్‌ బౌలింగ్‌లో (4.2వ ఓవర్‌) ఆడమ్‌ జంపా చేతికి క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో 30 పరుగుల వద్ద తొలి వికెట్‌ను భారత్‌ నష్టపోయింది.

14:02 November 19

టీమ్​ఇండియా బ్యాటింగ్​ ప్రారంభించింది. ఓపెనర్లు రోహిత్​ శర్మ, శుభమన్​ గిల్​ క్రీజులోకి వచ్చారు.

13:45 November 19

Ind vs Aus World Cup Final 2023
ఎయిర్​ షో

భారత్​- ఆస్ట్రేలియా మ్యాచ్​కు ముందుకు మోదీ స్డేడియం వద్ద సూర్యకిరణ్‌ ఏరోబాటిక్స్‌ బృందం వైమానిక విన్యాసాలు చేపట్టింది.

13:36 November 19

భారత తుది జట్టు.. రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్​మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్​దీప్ యాదవ్, జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, సిరాజ్.

ఆస్ట్రేలియా తుది జట్టు..డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్​వెల్, మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్​, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్​వుడ్.

13:23 November 19

వన్డే వరల్డ్​కప్​ ఫైనల్​ మ్యాచ్​ ప్రారంభమైంది. అందులో భాగంగా టాస్​ గెలుచుకున్న ఆస్ట్రేలియా బౌలింగ్​ ఎంచుకుంది. టీమ్​ఇండియాను బ్యాటింగ్​కు ఆహ్వానించింది.

12:46 November 19

ప్రధాని మోదీ ట్వీట్
ప్రధాని మోదీ ట్వీట్

ఈ మహా సమరానికి ముందు ప్రధాని నరేంద్రమోదీ టీమ్ఇండియాకు ఆల్​ ది బెస్ట్ చెప్పారు. "140 కోట్ల భారతీయులు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. మీరు అద్భుతంగా ఆడి.. క్రీడా స్ఫూర్తిని నిలబెట్టాలి" అని ట్వీట్ చేశారు.

12:34 November 19

  • ప్రపంచ కప్‌ విజేతకు ప్రైజ్‌మనీ ఎంతంటే?
  • వన్డే ప్రపంచకప్‌ విజేతకు భారీ నజరానా దక్కనుంది. విజేతగా నిలిచిన జట్టుకు ఐసీసీ.. రూ. 33 కోట్లు ప్రైజ్‌మనీగా ఇవ్వనుంది.
  • ఇక రన్నరప్‌గా నిలిచిన జట్టుకు.. రూ. 16.50 దాదాపు 16.50 కోట్లు దక్కనున్నాయి.

12:11 November 19

భారత్ X ఆస్ట్రేలియా లైవ్​ అప్డేట్స్​

Ind vs Aus World Cup Final 2023 : 2023 ప్రపంచకప్​ మహా సంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో.. రెండుసార్లు టోర్నీ విజేత భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం (నవంబర్ 19) మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు అత్యుత్తమ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌ కోసం కోట్లాది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2003 ప్రపంచకప్‌ ఫైనల్ పరాభవానికి బదులు తీర్చుకునేందుకు టీమ్ఇండియాకు ఇదే సరైన సమయం. ఈ టోర్నీలో మొత్తం ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఓ ప్రణాళికతో ఆడుతూ.. అన్నింట్లోనూ విజయం సాధించిన భారత్.. ఫైనల్‌లోనూ అదే జోరు కొనసాగించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి శుభారంభం ఇవ్వాలని.. విరాట్ కోహ్లీ ఫామ్​ కంటిన్యూ చేయాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శుభ్​మన్ గిల్ , శ్రేయస్ అయ్యర్ , కేఎల్ రాహుల్ , సూర్య కుమార్ యాదవ్​లు మరోసారి రాణిస్తే భారత్‌కు తిరుగుండదు. ఇక మహమ్మద్ షమీ, జస్​ప్రీత్ బూమ్రా, మహ్మద్ సిరాజ్ , కుల్​దీప్ యాదవ్ , రవీంద్ర జడేజాలతో బౌలింగ్​ బలంగా ఉంది. అశ్విన్​ను మూడో స్పిన్నర్​గా జట్టులోకి తీసుకుంటే.. సిరాజ్ బెంచ్​కు పరిమితమయ్యే అవకాశముంది.

అటు మెగా టోర్నీలో తొలి రెండు మ్యాచుల్లో ఓటముల నుంచి కోలుకుని.. వరుస విజయాలతో ఫైనల్ చేరింది ఆస్ట్రేలియా. తుదిపోరులో కూడా అదే జోరుతో ఆడాలని పట్టుదలతో ఉంది. బ్యాటింగ్‌లో వార్నర్‌, హెడ్‌లు అదే దూకుడుతో ఆడి తమ జట్టుకు మంచి ఆరంభాన్నివ్వాలని భావిస్తున్నారు. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో చెలరేగి ఆడిన మ్యాక్స్‌వెల్‌తో పాటు మార్ష్ ,స్మిత్‌లతో కూడిన బ్యాటింగ్ దళం పటిష్ఠంగానే ఉంది. బౌలింగ్‌లో స్టార్క్, హేజిల్​వుడ్‌, జంపా రాణించాలని ఆస్ట్రేలియా కోరుకుంటోంది.

ఫైనల్ మ్యాచ్‌పై భారీగా అంచనాలు, ఒత్తిడి ఉంటుందని తెలిపిన కెప్టెన్ రోహిత్.. ప్రశాంతతను కొనసాగిస్తూ మ్యాచ్‌పై దృష్టి సారిస్తామని చెప్పాడు. ఇక అహ్మదాబాద్‌ స్టేడియంలో లక్షన్నరకు పైగా అభిమానులు భారత్‌కు మద్దతిస్తారనే విషయం తెలుసన్న ఆసిస్ కెప్టెన్ కమిన్స్.. వారిని నిశ్శబ్దంగా మార్చేలా ప్రదర్శన చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

Last Updated : Nov 19, 2023, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.