ETV Bharat / sports

వరల్డ్​ కప్ మ్యాచ్​లకు పోటెత్తిన అభిమానులు- రికార్డు స్థాయిలో 10 లక్షలకు పైగా ప్రేక్షకులు హాజరు - వరల్డ్​ కప్​ వ్యూవర్​షిప్​ రికార్డు

ICC World Cup 2023 Viewership : భారత్​ ఆతిథ్యమిస్తున్న 2023 వరల్డ్​ కప్​నకు రికార్డులో స్థాయిలో ప్రేక్షకులు హాజరయ్యారు. నాకౌట్​ దశ ముగుస్తున్న నేపథ్యంలో.. ఇప్పటివరకు 10 లక్షలకు పైగా ప్రేక్షుకులు మ్యాచ్​లను వీక్షించారు. ఈ మేరకు ఐసీసీ వివరాలు వెల్లడించింది.

Icc World Cup 2023 Viewership
Icc World Cup 2023 Viewership
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2023, 1:24 PM IST

Updated : Nov 11, 2023, 2:54 PM IST

ICC World Cup 2023 Viewership : భారత్​ వేదికగా జరుగుతోన్న 2023 వరల్డ్​కప్​ను భారీ స్పందన లభిస్తోంది. ఈ ప్రపంచ కప్​లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్​లకు పది లక్షలకు పైగా మంది హాజరయ్యారు. దీంతో క్రికెట్​ చరిత్రలో అత్యధికంగా ప్రేక్షకులు హాజరైన ఐసీసీ ఈవెంట్స్​లో ఒకటిగా నిలిచిందీ వరల్డ్​ కప్​. ఇంకా ఆరు మ్యాచ్​లు జరగాల్సి ఉండగానే.. శుక్రవారం అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన అఫ్గానిస్థాన్-దక్షిణాఫ్రికా మ్యాచ్​లో ఈ ఫీట్​ సాధించింది. అంతేకాకుండా ఈ ఎడిషన్​ మెగాటోర్నీ.. డిజిటల్ మాధ్యమంలో పలు వ్యూవర్​షిఫ్​ రికార్డులను బద్దలుగొట్టింది. అయితే నాన్​ ఇండియా మ్యాచ్​లకు కూడా క్రికెట్​ అభిమానులు తరలిరావడం గమనార్హం.

"ఈ వరల్డ్​ కప్​నకు ఇప్పటికే పది లక్షల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ రికార్డు స్థాయి వ్యూవర్​షిఫ్​తో.. ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు, వన్డే ఫార్మాట్‌పై ఉన్న ఆసక్తిని గుర్తు చేసింది. వరల్డ్​ కప్​నకు ఉన్న విలువను హైలైట్​ చేసింది"
-- క్రిస్ టెట్లీ, ఐసీసీ హెడ్​ ఆఫ్​ ఈవెంట్స్

'కింగ్​' కోహ్లీ ఇన్నింగ్స్ ​రికార్డ్​​..!
Kohli 49th Century Viewership : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ స్టేడియంలో దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్‌లో.. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్‌ను 4.4 కోట్ల మంది చూశారు. ఇప్పటివరకు ఆన్​లైన్​ స్ట్రీమింగ్​ ప్లాట్​ఫామ్​ డిస్నీ హాట్‌స్టార్ చరిత్రలోనే ఈ స్థాయిలో వ్యూవర్‌షిప్ నమోదు కాకపోవడం గమనార్హం.

ఈ వరల్డ్​ కప్​లో శనివారం వరకు 42 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ గ్రూప్ దశలో తన తదుపరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్​తో ఆదివారం తలపడనుంది. ఇది టోర్నమెంట్​లో జరిగే చివరి గ్రూప్​ మ్యాచ్​. ఇక ఈ మ్యాచ్​ తర్వాత 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్, 19న ఫైనల్ ఉంటుంది. అయితే ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్​కు చేరుకున్నాయి. అయితే కివీస్​ కూడా సెమీ ఫైనల్​ బెర్త్​ను దాదాపు ఖాయం చేసుకుంది. ఒకవేళ శనివారం ఇంగ్లాండ్​తో జరిగే మ్యాచ్​లో పాక్​ భారీ (287 పరుగులు లేదా ఇంగ్లాండ్​ను 13 పరుగుల్లోపే ఆలౌట్ చేయాలి) తేడాతో గెలిస్తే.. ఆ జట్టు సెమీస్​కు చేరుతుంది.

వరల్డ్​ కప్​లో కొత్త మెరుపులు - సీనియర్స్​ ఉన్నా యంగ్​ ప్లేయర్ల హవా!

కెప్టెన్సీకి బాబర్​ అజామ్​ గుడ్​ బై- ఇంగ్లాండ్​తో మ్యాచ్​ తర్వాతే!

Last Updated : Nov 11, 2023, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.