ICC World Cup History : ప్రతి నాలుగేళ్లకోసారి జరిగే ప్రపంచకప్ కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. ఆ ట్రోఫీని ముద్దాడాలని ప్రతీ జట్టు ఎన్నో కలలు కంటుంది. అయితే పది జట్లు బరిలోకి దిగితే.. చివరకు ఒకరికే టైటిల్ దక్కుతుంది. ఇక రానున్న ఈ మెగా టోర్నీకి భారత్ వేదికైంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5న ఢిపెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్- రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్‌తోనే వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది.
-
Making its presence felt in the City of Love ❤️
— ICC (@ICC) August 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The ICC Men's Cricket World Cup Trophy visits the Eiffel Tower in Paris 🤩📸#CWC23 pic.twitter.com/aybqOCT4r1
">Making its presence felt in the City of Love ❤️
— ICC (@ICC) August 21, 2023
The ICC Men's Cricket World Cup Trophy visits the Eiffel Tower in Paris 🤩📸#CWC23 pic.twitter.com/aybqOCT4r1Making its presence felt in the City of Love ❤️
— ICC (@ICC) August 21, 2023
The ICC Men's Cricket World Cup Trophy visits the Eiffel Tower in Paris 🤩📸#CWC23 pic.twitter.com/aybqOCT4r1
వరల్డ్ కప్ టూర్లో భాగంగా ప్రపంచాన్ని చుట్టొస్తున్న ప్రపంచ కప్ తాజాగా హైదరాబాద్‌లో సందడి చేసింది. రామోజీ ఫిల్మ్ సిటీ, చార్మినార్, ఇన్ఆర్బిట్ మాల్, ఉప్పల్ స్టేడియం, హుస్సేన్ సాగర్ లాంటి ప్రముఖ సందర్శనీయ స్థలాల్లో ఈ ట్రోఫీ కనువిందు చేసింది. అయితే ఛాంపియన్స్‌గా నిలిచే జట్టుకు బహుకరించే ట్రోఫీ హిస్టరీ, దాన్ని ఎవరు రూపొందిచారన్న విషయాల గురించి అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. ఈ క్రమంలో అటువంటి ఇంట్రెస్టింగ్ విశేషాల మీకోసం.
-
ICC 2023 World Cup Trophy in Ramoji Film City in Hyderabad. pic.twitter.com/EDA74EgTsh
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ICC 2023 World Cup Trophy in Ramoji Film City in Hyderabad. pic.twitter.com/EDA74EgTsh
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2023ICC 2023 World Cup Trophy in Ramoji Film City in Hyderabad. pic.twitter.com/EDA74EgTsh
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2023
ప్రుడెన్షియల్ వరల్డ్‌కప్(1975) : వన్డే ప్రపంచకప్ ప్రయాణం 1975లో మొదలైంది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డే వరల్డ్‌కప్‌ను వెస్టిండీస్ కైవసం చేసుకుని రికార్డుకెక్కింది. అయితే ఈ టోర్నీ ఐసీసీ ఆధ్వర్యంలో జరిగినప్పటికీ దానికి 'ప్రుడెన్షియల్ వరల్డ్‌కప్' అని పేరు పెట్టారు. ప్రుడెన్షియల్ అనే బీమా కంపెనీ తొలి వరల్డ్‌కప్ స్పాన్సర్‌గా వ్యవహరించినందున ఆ కప్‌కు ఆ పేరు పెట్టారు.
ఇక మొట్టమొదటిగా ప్రపంచ కప్.. వెండి, బంగారం కలయికతో రూపొందింది. ట్రోఫీ పైభాగంలో బంగారు పూతతో తయారు చేసిన ఓ క్రికెట్ బాల్‌ను అమర్చారు. 1979, 1983 ప్రపంచకప్‌ను కూడా ప్రుడెన్షియల్ కంపెనీనే స్పాన్సర్ చేసింది. అయితే 1979 వన్డే ప్రపంచకప్‌ను రెండో సారి విండీస్ కైవసం చేసుకుగా.. 1983 కప్‌ను భారత జట్టు ముద్దాడింది.
-
Hyderabad's iconic Charminar welcomes for The ICC World Cup 2023#ICCWorldCup2023 #TeamIndia pic.twitter.com/J2rHuu7T6b
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) September 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hyderabad's iconic Charminar welcomes for The ICC World Cup 2023#ICCWorldCup2023 #TeamIndia pic.twitter.com/J2rHuu7T6b
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) September 21, 2023Hyderabad's iconic Charminar welcomes for The ICC World Cup 2023#ICCWorldCup2023 #TeamIndia pic.twitter.com/J2rHuu7T6b
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) September 21, 2023
రిలయన్స్ ట్రోఫీ(1987) : ఆ తర్వాత 1987 వరల్డ్‌కప్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త టైటిల్ స్పాన్సర్‌గా ఎంపికైంది. దీంతో ఆ ఏడాది మెగా ఈవెంట్‌ను రిలయన్స్ కప్‌గా పిలిచేవారు. ఇక ఈ కప్ కూడా వెండి, బంగారం కలయికతో రూపొందింది. ప్రుడెన్షియల్ కంపెనీలా రిలయన్స్ కూడా ట్రోఫీలో క్రికెట్ బాల్‌ను అమర్చింది. ఆ ఏడాది ఆస్ట్రేలియా జట్టు తొలి వరల్డ్‌కప్‌ను అందుకుంది.
బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ కప్ : అయితే రిలయన్స్ కేవలం ఒక్క వరల్డ్ కప్‌కు మాత్రమే టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఆ తర్వాత 1992 ప్రపంచకప్‌కు బెన్సన్ అండ్ హెడ్జెస్ అనే బ్రిటీష్ సిగిరెట్ కంపెనీ టైటిల్‌ను స్పాన్సర్‌గా వచ్చింది. దీంతో ఆ ఏడాది టోర్నీని బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్‌కప్ అని పిలిచేవారు. ఆ ఏదాడి ఆ కప్‌ను పాకిస్థాన్ జట్టు కైవసం చేసుకుంది.
-
2023 World Cup Trophy at the Uppal Stadium in Hyderabad #CWC2023 @BCCI @ICC pic.twitter.com/WDujl8jScT
— Mahesh Snithik (@pogula_mahesh) September 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">2023 World Cup Trophy at the Uppal Stadium in Hyderabad #CWC2023 @BCCI @ICC pic.twitter.com/WDujl8jScT
— Mahesh Snithik (@pogula_mahesh) September 21, 20232023 World Cup Trophy at the Uppal Stadium in Hyderabad #CWC2023 @BCCI @ICC pic.twitter.com/WDujl8jScT
— Mahesh Snithik (@pogula_mahesh) September 21, 2023
విల్స్ వరల్డ్‌కప్(1996) : బెన్సన్ అండ్ హెడ్జెస్ కంపెనీ తర్వాత.. 1996 వన్డే ప్రపంచకప్‌కు విల్స్ అనే మరో సిగిరెట్ కంపెనీ టైటిల్ స్పాన్సరైంది. దీంతో ఆ టోర్నీని విల్స్ వరల్డ్ కప్ అని పిలిచేవారు. ఇక ఈ విల్స్ కప్‌ను శ్రీలంక గెలుచుకుంది. అయితే 1996 ప్రపంచ కప్ తర్వాత ఐసీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 1999 వరల్డ్ కప్ కోసం ఆ సంస్థ ఓ కొత్త ట్రోఫీని ప్రవేశ పెట్టింది. దాన్ని తయారు చేసే బాధ్యతలను లండన్‌లోని గారార్డ్ అనే ప్రముఖ జ్యుయలరీ సంస్థకు అప్పజెప్పింది. ఆ కప్‌ను రూపొందించేందుకు రెండు నెలల సమయం పట్టింది. వెండితో తయారైన ఈ ట్రోఫీకి పైనుంచి బంగారు పూత పూశారు.
సుమారు 60 సెంటీమీటర్ల ఎత్తుతో ఉన్న ఆ ట్రోఫీ పైన గోల్డెన్ కలర్లో ఓ గ్లోబ్‌ను అమర్చారు. దానికి సపోర్ట్‌గా మూడు సిల్వర్ కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్‌లు స్టంప్‌లు, బెయిల్స్ రూపొంలో నిలువ వరుసగా ఉంటాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా మూడు అంశాలను ప్రతిబింబించేలా ఈ ట్రోఫీని తయారు చేశారు. ఇక పైనున్న గ్లోబ్ క్రికెట్ బంతిని సూచిస్తుంది. అయితే ఈ ట్రోఫీని ప్రత్యేక కొలతలతో రూపొందించారు. సుమారు 11 కిలోల బరువు ఉండే ఈ కప్ ఏ కోణం నుంచి చూసిన ట్రోఫీ ఒకే విధంగా ఉంటుంది.
-
One of the seven wonders of the world and the ICC Men's Cricket World Cup Trophy 😍#CWC23 #TajMahal pic.twitter.com/CojWBit7jp
— ICC Cricket World Cup (@cricketworldcup) August 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">One of the seven wonders of the world and the ICC Men's Cricket World Cup Trophy 😍#CWC23 #TajMahal pic.twitter.com/CojWBit7jp
— ICC Cricket World Cup (@cricketworldcup) August 18, 2023One of the seven wonders of the world and the ICC Men's Cricket World Cup Trophy 😍#CWC23 #TajMahal pic.twitter.com/CojWBit7jp
— ICC Cricket World Cup (@cricketworldcup) August 18, 2023
ధర ఎంతంటే?
ICC World Cup Price : క్రికెట్ లవర్స్ ప్రతిష్టాత్మకంగా భావించే ఈ ప్రపంచ కప్ ట్రోఫీ తయారీకి ఐసీసీ 40వేల పౌండ్లు ఖర్చు చేసింది. అంటే ప్రస్తుత భారత్ ధరల ప్రకారం దీని ధర సుమారు రూ.30,85,320. వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టుకు ఈ ట్రోఫీని అందిస్తారు. ఇక విన్నర్ జట్టు పేరును ట్రోఫీ కింద ముద్రిస్తారు. అయితే ఒరిజినల్ ట్రోఫీని గెలిచిన వారికి ఇవ్వరు. దాన్ని పోలిన నకలును మాత్రమే అందజేస్తారు. ఒరిజనల్ ట్రోఫీని ఐసీసీ.. దుబాయ్‌లోని తమ ఆఫీస్‌లో ఉంచుతుంది.