ETV Bharat / sports

ICC World Cup 2023 : మూడోసారి వరల్డ్​కప్ టైటిల్​​పై టీమ్​ఇండియా ధీమా.. మరి సమస్యల సంగతేంటి? - ICC World Cup 2023 problems

ICC World Cup 2023 : ఆసియా కప్​-2023 విజయంతో ఊపుమీదున్న టీమ్​ఇండియా.. వరల్డ్​ కప్​-2023కు సన్నద్ధం మవుతోంది. జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని కెప్టెన్ రోహిత్​ శర్మ చెబుతున్నా.. కొన్ని సమస్యలు మాత్రం సమస్యలు వెంటాడుతున్నాయి. అవేంటంటే..

ICC World Cup 2023
ICC World Cup 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2023, 5:53 PM IST

ICC World Cup 2023 : శ్రీలంకతో జరిగిన ఆసియా కప్​-2023 ఫైనల్​లో వార్​ వన్​సైడ్​ చేసి ఛాంపియన్స్​గా నిలిచింది టీమ్​ ఇండియా. కేవలం 50 పరుగులకే లంకేయులను మట్టికరిపించి.. సునాయసంగా విజయం సాధించింది. ఈ విజయోత్సాహంతో మెగా టోర్నీకి సన్నద్ధం అవుతోంది భారత జట్టు. అక్టోబర్​ 5న ప్రారంభం కానున్న ఐసీసీ వన్డే వరల్డ్​ కప్​-2023లో.. 12 ఏళ్ల నిరీక్షణకు చరమగీతం పాడాలను ఆశిస్తోంది.

అయితే, ఇప్పటివరకు గాయాలు, మిడిలార్డర్​ గందరగోళం, జట్టులో ఆల్​ వెదర్​ బౌలింగ్​ అటాక్​ లేకపోవడం లాంటి సమస్యలను ఎదుర్కొంది జట్టు. కేఎల్​ రాహుల్ రాకతో మిడిలార్డ్​ సమస్యకు కాస్త ఊరట లభించినట్టైంది. ఇక గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్​ ఆసియా కప్​లో అడుగుపెట్టినా.. ఆఖరి క్షణంలో వెన్ను నొప్పి కారణంగా వెనుదిరిగాడు. అయితే, అతడు 99 శాతం కోలుకున్నాడని.. ఈ నొప్పి వరల్డ్​పై ప్రభావం చూపించదని కెప్టెన్​ రోహిత్ శర్మ తెలిపాడు. అన్ని సవ్యంగా సాగి శ్రేయస్​ జట్టులో ఉంటే.. మిడిలార్డర్​కు ఢోకా ఉండదు.

జట్టులో వైవిధ్యమైన బౌలర్స్​ ఉన్నారు : రోహిత్ శర్మ
ఇక బౌలింగ్​ విషయానికొస్తే.. ప్రస్తుతం భారత్ క్యాంప్​లో అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. గాయం నుంచి కోలుకున్న బుమ్రా నిలకడగా రాణిస్తున్నాడు. శ్రీలంకతో జరిగిన ఆసియా కప్​ ఫైనల్​ మ్యాచ్​లో 6 వికెట్లు పడగొట్టు ఊపుమీదున్నాడు. ఇక స్పిన్నర్ కుల్దీప్​ యాదవ్ అద్భుతంగా రాణిస్తున్నాడని.. గత రెండేళ్లుగా అతడి కాన్ఫిడెన్స్​ పెరుగుతోందని స్వయంగా రోహిత్​ శర్మ కితాబివ్వడం మంచి శకునమే. కుల్​దీప్ ఎలాంటి పరిస్థితి నుంచి అయినా జట్టును గట్టెక్కించగలడని రోహిత్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. తమ జట్టులో విభిన్న నైపుణ్యాలు కలిగిన బౌలర్లు ఉన్నారని.. ఇవన్నీ ఒక జట్టులో ఉంటే కెప్టెన్​కు అత్మవిశ్వాసం పెరుగుతుందని రోహిత్​ తెలిపాడు.

అభిమానుల కోసం వరల్డ్​ కప్​ గెలుస్తాం : విరాట్​ కోహ్లీ
అభిమానుల కోసం వరల్డ్​ కప్​ గెలవాలనే పట్టుదలతో ఉన్నామని విరాట్​ కోహ్లీ అన్నాడు. స్వదేశంలో జరగనున్న మెగా టోర్నీలో సత్తా చాటేందు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అభిమానుల మద్దతు.. కప్పు గెలవాలనే తమ సంకల్పానికి ఆజ్యం పోసిందని పేర్కొన్నాడు. ఆల్​రౌండర్​ జడేజా కూడా జట్టుపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశాడు.

ఇంకా కొన్ని సమస్యలున్నాయ్​..
ఈసారి వరల్డ్​ టైటిల్​ టీమ్ఇండియా గెలుస్తుందని టీమ్​ ఇండియా మాజీ సారథి కపిల్​ దేవ్ అన్నారు​. కానీ తన మనసు ఒకటి చెబితే.. మైండ్​ మాత్రం జట్టు ఇంకా కష్టపడాలని చెబుతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను టీమ్​ఇండియాకు ఫేవరేట్​ ట్యాగ్​ ఆపాదించడం లేదని.. చాలా వరకు అదృష్టంపై ఆధారపడుతుందని చెప్పారు. జట్టు మాత్రం బాగానే ఉందని.. కానీ ప్లేయర్లు మాత్రం ఆటను ఎంజాయ్​ చేసుకుంటూ ఉద్వేగభరితంగా ఆడాలని చెప్పారు. అయితే, ఇదే అభిప్రాయాన్ని ఈ ఏడాది జులైలో మాజీ ప్లేయర్ యువరాజ్​ సింగ్​ వ్యక్తం చేశాడు. ఈసారి జట్టు వరల్డ్​ కప్​ గెలవలేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అయితే వీరంతా మనస్ఫూర్తిగా చెప్పకున్నా.. జట్టును మాత్రం కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. అక్షర్​ పటేల్​, శ్రేయస్ అయ్యర్​ గాయాలతో బాధపడుతుండటం కొంత కలవరపాటుకు గురి చేస్తోంది. జట్టులో ముఖ్యమైన ఇద్దరు ప్లేయర్లు ఇలా గాయాలతో ఇబ్బంది పడితే.. అది టీమ్​ ఫలితాలపై ప్రభావం చూపిస్తుందని కపిల్​ దేవ్​ చెప్పడం గమనార్హం. ప్రపంచకప్‌కు ఎంపికైన అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌.. వీరి ఫామ్‌ ఆశాజనకంగా లేదు. జట్టుకు ఈ ముగ్గురూ భారమవుతారేమో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక జట్టు నిలకడపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించి ముచ్చటగా మూడోసారి వరల్డ్​కప్​ను టీమ్ఇండియా ఎలా ముద్దాడుతుందనేదానికి కాలమే సమాధానం చెబుతుంది.

IND vs SL Asia Cup 2023 Final : ఏడాదిన్నర తర్వాత టీమ్ఇండియా టాప్​లోకి.. ఈ మ్యాచ్​లో మరిన్ని విశేషాలు ఇవే

IND vs SL Asia Cup 2023 Final : జయహో భారత్.. ఫైనల్​లో లంక చిత్తు.. ఎనిమిదో టైటిల్ టీమ్ఇండియా వశం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.