ETV Bharat / sports

ICC World Cup 2023 : 'అప్పుడు సచిన్​ కోసం.. ఇప్పుడు విరాట్​ కోసం' - virender sehwag comments

ICC World Cup 2023 : భారత్​ వేదికగా జరిగే ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌పై టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2011లో వన్డే ప్రపంచ కప్​ నాటి సంగతుల్ని నెమరువేసుకున్నాడు. ఆ సంగతులు..

Virender Shewag On ICC World Cup 2023
అప్పుడు సచిన్​ కోసం గెలిచాం.. ఇప్పుడు విరాట్​ కోసం గెలవండి.. : వీరేంద్ర సెహ్వాగ్​
author img

By

Published : Jun 27, 2023, 6:33 PM IST

ICC World Cup 2023 : అక్టోబర్​ 5 నుంచి భారత్​ వేదికగా జరగబోయే ఐసీసీ వన్డే ప్రపంచకప్​ 2023 ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని క్రికెట్​ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నాలుగేళ్లకోసారి జరిగే ఈ సమరానికి అంతలా క్రేజ్ ఉంటుంది మరి. అయితే మరో వంద రోజుల్లో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో కాళ్లు దువ్వేందుకు అన్ని జట్లు సిద్ధమవుతున్న వేళ ఐసీసీ దీనికి సంబంధించి షెడ్యూల్​ను కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్​ వీరేంద్ర సెహ్వాగా వన్డే వరల్డ్​కప్​ 2023పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు మేము టైటిల్​ను గెలిచి.. దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్​కు అంకితం చేస్తే.. ఈసారి ట్రోఫీని గెలిచి విరాట్​కు డెడికేట్​ చేయాలని కోరాడు. ప్రముఖ స్టార్‌స్పోర్ట్స్‌కు ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్య్వూలో సెహ్వాగ్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇక కోహ్లి తన బ్యాటింగ్‌లో వందశాతం ఇచ్చేందుకు శాయాశక్తులా ప్రయత్నిస్తాడని చెప్పాడు.

"2011లో వన్డే ప్రపంచ కప్​ను గెలిచి మేము సచిన్‌కు అంకితమిచ్చాం. ఇప్పుడు 2023 వన్డే వరల్డ్‌కప్​ విరాట్​​ కోహ్లీ కోసం గెలవాలి. సచిన్‌ తర్వాత భారత క్రికెట్‌లో అద్భుతమైన రికార్డులు సాధించిన ఆటగాడు కోహ్లీ. బహుశా అతడికి ఇదే చివరి ప్రపంచకప్‌ కావచ్చు. ఇందుకోసమైనా టీమ్​ఇండియా ఈసారి కప్పు గెలవాలి. గెలుస్తుంది. 34 ఏళ్ల కింగ్​ విరాట్​ కోహ్లీ కూడా ఈ వరల్డ్‌కప్‌ను గొప్ప అవకాశంగా మలుచుకోవాలని ఎదురుచూస్తున్నాడు. లక్షలాది మంది అభిమానుల మధ్య అహ్మదాబాద్‌ వేదికగా జరిగే ఫైనల్‌ మ్యాచ్​లో టీమ్​ఇండియాను చూడాలని ఉంది. ఈసారి సొంతగడ్డపై టోర్నీ జరగడం భారత్​కు కలిసొచ్చే అంశం. అలాగే టీమ్​ఇండియా ఆడబోయే మ్యాచ్​ల మైదానాల పిచ్​లపై కోహ్లీకి పూర్తి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో రానున్న వరల్డ్​కప్​ పోరులో కోహ్లీ తన ప్రతిభతో కప్పును కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది "

- వీరేంద్ర సెహ్వాగ్​, మాజీ క్రికెటర్​

12 ఏళ్ల క్రితం..
సరిగ్గా 12 ఏళ్ల క్రితం అంటే 2011లో ధోని సారథ్యంలో సొంతగడ్డపై వాంఖడే వేదికగా జరిగిన ప్రపంచ్​కప్​లో టీమ్​ఇండియా టైటిల్​ను ముద్దాడింది. అప్పుడు సచిన్‌ తెందూల్కర్​, వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్ సహా విరాట్‌ కోహ్లీ వంటి స్టార్‌ క్రికెటర్లు జట్టులో ఉన్నారు. అయితే జట్టు విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించిన సచిన్​, సెహ్వాగ్​లకు ధోనీ, యువరాజ్​ సింగ్​, గౌతమ్​ గంభీర్​లు వెన్నుగా నిలిచారు.

మాట నిలబెట్టుకున్నాడు..
అప్పటికే తన క్రికెట్​ కెరీర్​లో దాదాపు అన్ని రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నారు క్రికెట్​ గాడ్​ సచిన్​ తెందూల్కర్​. కానీ, ప్రపంచకప్​ కొట్టలేదనే ఓ బాధ మాత్రం ఉండేది. ఈ క్రమంలో వరల్డ్​కప్​ ప్రారంభానికి ముందు ఈసారి ఎలాగైనా ప్రపంచకప్​ గెలిచి సచిన్​కు గిఫ్ట్​గా ఇస్తాం అని శపథం పూనాడు యువరాజ్​ సింగ్​. అన్నట్లుగానే తన ఆల్​రౌండ్​ ప్రదర్శనతో టీమ్​ విక్టరీ సాధించడంలో ముఖ్యపాత్ర పోషించి మాట నిలబెట్టుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.