ICC Women world cup 2022: న్యూజిలాండ్‌లో ఈ మార్చిలో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టును ప్రకటించారు. మిథాలీ రాజ్ కెప్టెన్సీలో 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఖరారు చేసింది. ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు ఫిబ్రవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచుల వన్డే సిరీస్ కూడా ఆడనుంది. ఈ సిరీస్‌లో కూడా ఇదే జట్టు తలపడనుంది.
మార్చి 4న ప్రారంభంకానున్న ఈ మెగాటోర్నీలో టీమ్ఇండియా తన తొలి మ్యాచ్‌ను మార్చి 6న ఓవల్ వేదికగా పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆ తర్వాత న్యూజిలాండ్(మార్చి 10), వెస్టిండీస్(మార్చి 12), ఇంగ్లాండ్(మార్చి 16), ఆస్ట్రేలియా(మార్చి 19), బంగ్లాదేశ్(మార్చి 22), దక్షిణాఫ్రికాతో(మార్చి 27) గ్రూప్ స్టేజ్‌లో ఆడనుంది. కాగా, ఈ టోర్నీకి కీలక ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్‌ను ఎంపిక చేయకపోవడం గమనార్హం.
జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యాస్తికా భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), స్నేహ్ రాణా, జులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్ , తానియా భాటియా (వికెట్‌కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్.
స్టాండ్ బై ప్లేయర్స్: సబ్బినేని మేఘన, ఏక్తా బిష్త్, సిమ్రాన్ దిల్ బహదూర్.
న్యూజిలాండ్‌తో ఫిబ్రవరి 9న జరిగే టీ20 కోసం మరో జట్టును ప్రకటించారు.
జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, యాస్తిక భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), స్నేహ రాణా, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుక సింగ్ ఠాకూర్, తానియా భాటియా (వికెట్‌కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్, ఎస్. మేఘన, సిమ్రాన్ దిల్ బహదూర్.
ఇదీ చూడండి: ఈ స్విమ్మర్ ఈదితే రికార్డ్.. ఇక నవ్విందంటే..