ETV Bharat / sports

ఐసీసీ మహిళా క్రికెట్​​ ర్యాంకింగ్స్​: మిథాలీ రాజ్​@2

author img

By

Published : Feb 1, 2022, 7:16 PM IST

ICC Women's ODI Rankings: అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ).. మహిళల క్రికెట్​ వన్డే ర్యాంకింగ్స్​ను మంగళవారం విడుదల చేసింది. వన్డే​ బ్యాటింగ్​ ర్యాంకింగ్స్​లో కెప్టెన్ మిథాలీ రాజ్ ఒక స్థానం పైకి ఎగబాకి రెండోస్థానానికి చేరుకుంది. మరోవైపు బౌలింగ్​ ర్యాంకింగ్స్​లో జులన్ గోస్వామి యథావిధిగా తన రెండో స్థానాన్ని పదిలపరుచుకుంది.

ICC Women's ODI Rankings
ఐసీసీ మహిళా క్రికెట్​​ ర్యాంకింగ్స్

ICC Women's ODI Rankings: మహిళా క్రికెట్​ వన్డే ర్యాంకింగ్స్​ను అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) మంగళవారం విడుదల చేసింది. వన్డే బ్యాటింగ్​ ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్​ ఒక స్థానం ఎగబాకి 738 పాయింట్లతో రెండోస్థానానికి చేరుకోగా.. ​ స్మృతి మంధాన(710) 6వ స్థానంలో ఉంది. 750 పాయింట్లతో ఆస్ట్రేలియాకు చెందిన అలిస్సా హీలీ అగ్రస్థానంలో నిలిచింది.

ఆల్​రౌండర్లలో..

ఆల్​ రౌండర్లలో భారత క్రీడాకారిణి దీప్తి శర్మ ఒక స్థానం ఎగబాకి నాలుగో స్థానాన్ని పొందింది. ఇంగ్లాండ్​కు చెందిన నటాలీ స్కివర్‌ 372 పాయింట్లతో మొదటిస్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లీస్‌ పెర్రీ (365)తో తర్వాత స్థానంలో కొనసాగుతోంది.

ICC Women's ODI Rankings
ఐసీసీ మహిళా క్రికెట్​​ ర్యాంకింగ్స్

బౌలింగ్ విభాగంలో..

ఐసీసీ వన్డే బౌలింగ్​ ర్యాంకింగ్స్​లో జులన్ గోస్వామి యథావిధిగా తన రెండో స్థానాన్ని పదిలపరుచుకుంది. ఆస్ట్రేలియన్ బౌలర్ జెస్ జోనాస్సెన్ (760) అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియాకు చెందిన మరో క్రీడాకారిణి మేగాన్ షట్ (717) మూడో స్థానంలో కొనసాగుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: Virat Kohli: ఆ ధర చూసి ఆశ్చర్యపోయా: విరాట్ కోహ్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.