ETV Bharat / sports

ICC Test Rankings: కోహ్లీ మరింత దిగువకు.. ​రాహుల్​, బుమ్రా జోరు - కోహ్లీ టెస్టు ర్యాంకింగ్స్​

ICC Test Rankings: తాజాగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది. కోహ్లీ మరింత కిందకు దిగజారగా.. కేఎల్​ రాహుల్​, బుమ్రా, షమీ తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు.

ICC Test Rankings
ICC Test Rankings
author img

By

Published : Jan 5, 2022, 2:33 PM IST

ICC Test Rankings: ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది. బ్యాటింగ్​ విభాగంలో కేఎల్​ రాహుల్​ 18 స్థానాలను ఎగబాకి 31 ర్యాంకుకు చేరుకోగా.. సారథి కోహ్లీ మరో రెండు స్థానాలు దిగజారి తొమ్మిదిలో నిలిచాడు. రోహిత్​ శర్మ ఐదో ర్యాంకులోనే కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్​, ఓపెనర్​ డీన్​ ఎల్గర్​ రెండు ర్యాంకులు ముందుకు జరిగి 14లో నిలవగా.. టెంబా బవుమా 16 స్థానాలు ఎగబాకి 39కి చేరుకున్నాడు.

బౌలింగ్​ విభాగంలో టీమ్​ఇండియా పేసర్లు​ బుమ్రా, మహ్మద్​ షమీ తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. బుమ్రా మూడు ర్యాంకులు జరిగి తొమ్మిదికి చేరుకోగా.. షమీ రెండు స్థానాలు ముందుకు జరిగి 17లో నిలిచాడు. రవిచంద్రన్ అశ్విన్​ రెండో స్థానంలోనే కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడా ఓ ర్యాంకు ముందుకు జరిగి ఆరుకు చేరుకోగా లుంగి ఎంగిడి ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 30లో కొనసాగుతున్నాడు.

ఇదీ చూడండి: Eng Vs Aus: తొలి రోజు ఆట వరుణుడిదే.. ఆసీస్​ 126/3

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.