ICC Suspends Sri Lanka Cricket Board : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీలంక క్రికెట్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఒక సభ్య దేశంగా శ్రీలంక తమ బాధ్యతలను ఉల్లంఘించిందని ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రికెట్ బోర్డులో ప్రభుత్వం జోక్యం చేసుకోడం పట్ల ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. శుక్రవారం సమావేశమైన ఐసీసీ బోర్డు తెలిపింది. సస్పెండ్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ స్పష్టం చేసింది
అయితే ప్రస్తుత ప్రపంచకప్‌లో శ్రీలంక పేలవ ప్రదర్శన పట్ల.. ఆ దేశ ప్రభుత్వం ఆగ్రహించింది. దీంతో లంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై స్పందించిన శ్రీలంక కోర్టు.. బోర్డుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే రద్దును ఉపసహరించుకోమంటూ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ గురువారం శ్రీలంక పార్లమెంట్.. ఆ దేశ క్రికెట్ పాలకమండలిని తొలగించాలని తీర్మానించింది. కాగా, ఆ మరుసటి రోజే ఐసీసీ ఈ బోర్డుపై ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
-
International Cricket Council (ICC) Board has suspended Sri Lanka Cricket’s membership of the ICC with immediate effect.
— ANI (@ANI) November 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The ICC Board met today and determined that Sri Lanka Cricket is in serious breach of its obligations as a Member, in particular, the requirement to manage… pic.twitter.com/mIk0EuwQw8
">International Cricket Council (ICC) Board has suspended Sri Lanka Cricket’s membership of the ICC with immediate effect.
— ANI (@ANI) November 10, 2023
The ICC Board met today and determined that Sri Lanka Cricket is in serious breach of its obligations as a Member, in particular, the requirement to manage… pic.twitter.com/mIk0EuwQw8International Cricket Council (ICC) Board has suspended Sri Lanka Cricket’s membership of the ICC with immediate effect.
— ANI (@ANI) November 10, 2023
The ICC Board met today and determined that Sri Lanka Cricket is in serious breach of its obligations as a Member, in particular, the requirement to manage… pic.twitter.com/mIk0EuwQw8
అసలేం జరిగిందంటే? నవంబర్ 2న ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో 302 పరుగుల తేడాతో లంక జట్టు భారత్ చేతిలో ఓడింది. ఈ ఘోర పరాజయం తర్వాత పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇలా ప్రపంచకప్‌లో భారత్ చేతిలో శ్రీలంక ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ)పై వేటు పడింది. దీంతో క్రికెట్ బాధ్యతలను ఏడుగురు సభ్యులతో కూడిన ఓ మధ్యంతర కమిటీని ఏర్పాటు చేసి వారికి అప్పగించారు. ఈ మధ్యంతర కమిటీలో రణతుంగతో పాటు ముగ్గురు రిటైర్డ్ న్యాయమూర్తులు, ఇద్దరు మహిళలు, ఎస్‌ఎల్‌సీ మాజీ అధ్యక్షుడు ఉపాలి ధర్మదాస ఉన్నారు.
ప్రపంచకప్‌లో శ్రీలంక ప్రదర్శన.. ఈ మెగాటోర్నీలో శ్రీలంక ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. దీంతో లంక ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన లంక.. కేవలం రెండింట్లోనే విజయం సాధించింది. మిగిలిన 7 మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో మిగిలిపోయింది.
శ్రీలంక క్రికెట్ బోర్డుకు కోర్టులో ఊరట - రద్దు నిర్ణయం రివర్స్