ETV Bharat / sports

ICC Rankings: అగ్రస్థానంలో మిథాలీ, షెఫాలీ - స్మృతి మందాన

మంగళవారం అంతర్జాతీయ క్రికెట్​ మండలి విడుదల చేసిన క్రికెట్​ ర్యాంకింగ్స్​లో భారత మహిళా క్రికెటర్లు సత్తా చాటారు. వన్డేల్లో కెప్టెన్​ మిథాలీ రాజ్​(Mithali Raj), టీ20ల్లో షెఫాలీ వర్మ(Shafali Verma) అగ్రస్థానంలో నిలవగా.. స్మృతి మంధాన(Smriti Mandhana) కెరీర్​లో ఉత్తమ ర్యాంకుకు చేరుకుంది.

ICC Rankings: Mithali back on top of WODI list, Mandhana No. 3 among T20 batters
ICC Rankings: అగ్రస్థానంలో మిథాలీరాజ్​, షెఫాలీ వర్మ
author img

By

Published : Jul 20, 2021, 3:40 PM IST

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​లో భారత మహిళా జట్టు కెప్టెన్​ మిథాలీ రాజ్​(Mithali Raj) అగ్రస్థానానికి చేరింది. 16 ఏళ్ల తర్వాత మిథాలీరాజ్​ మరోసారి తొలి ర్యాంకును దక్కించుకుంది. వన్డే బ్యాటింగ్​ టాప్​-10 ర్యాంకుల్లో మరో భారత మహిళా క్రికెటర్​ స్మృతి మంధాన 9వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు వెస్టిండీస్​ మహిళా జట్టు కెప్టెన్​ స్టాఫానీ టైలర్​ నాలుగు స్థానాలు కోల్పోయి 5 ర్యాంకుకు పరిమితమైంది.

బౌలర్ల జాబితాలో భారత బౌలర్​ జూలన్​ గోస్వామి(Jhulan Goswami) ఐదో ర్యాంకులో కొనసాగుతుండగా.. ఆల్​రౌండర్​ జాబితాలో దీప్తి శర్మ(Deepti Sharma) కూడా 5వ స్థానంలోనే నిలిచింది.

టీ20 ర్యాంకుల్లో..

మహిళల టీ20 ర్యాంకుల్లో భారత లెఫ్ట్​హ్యాండ్​ బ్యాట్స్​వుమన్​ స్మృతి మంధాన(Smriti Mandhana) 3వ స్థానానికి చేరుకుంది. ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్​ అఖరి మ్యాచ్​లో 70 పరుగులు చేసి.. కెరీర్​లోనే ఉత్తమ ర్యాంకుకు చేరుకుంది. ఇదే జాబితాలో మరో భారత క్రికెటర్​ షెఫాలీ వర్మ(Shafali Verma) తొలి ర్యాంకులో కొనసాగుతోంది.

మరోవైపు బౌలింగ్​ ర్యాంకుల్లో దీప్తి శర్మ(Deepti Sharma) 6వ స్థానంలోనే కొనసాగుతుండగా.. పూనమ్​ యాదవ్​(Poonam Yadav) ఒక స్థానాన్ని కోల్పోయి 8వ ర్యాంకుకు పరిమితమైంది.

ఇదీ చూడండి.. IND vs SL: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.