ETV Bharat / sports

ఇషాన్​ సూపర్​.. 68 స్థానాలు ఎగబాకి టాప్​10లోకి.. రోహిత్​, కోహ్లీల ర్యాంకులు​ ఎంతంటే? - టెస్టు ర్యాంకింగ్స్​

అంతర్జాతీయ క్రికెట్​​ కౌన్సిల్​ క్రికెటర్ల టీ20, టెస్టు, వన్డేల ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది. టీమ్​ఇండియా తరఫున టీ20 ర్యాంకింగ్స్​లో ఇషాన్​ కిషన్​ ఒక్కడే నిలవగా.. టెస్టుల్లో ఐదుగురికి, వన్డేల్లో ఇద్దరికి మాత్రమే చోటు దక్కింది. మరి ఈ లిస్ట్​లో ఏ క్రికెటర్​ ర్యాంకు ఎంత ఉందంటే..

ఐసీసీ
ఐసీసీ
author img

By

Published : Jun 15, 2022, 5:06 PM IST

టీమ్​ఇండియా యువక్రికెటర్​ ఇషాన్​ కిషన్​ ఐసీసీ ర్యాంకింగ్స్​లో అదరగొట్టేశాడు. టీ20 ర్యాంకింగ్స్​లో 68 స్థానాలు ఎగబాకి 689 పాయింట్లతో టాప్​ 10లో చోటు సంపాదించాడు. అంతేకాదు.. టీ20 టాప్​ 10 బ్యాట్స్​మెన్ ర్యాంకింగ్స్​లో ​నిలిచిన ఏకైక భారత ఆటగాడిగా నిలిచాడు. కిషన్​ తర్వాత స్థానాల్లో కేఎల్​ రాహుల్​ (14), రోహిత్​ శర్మ (16), శ్రేయస్​ అయ్యర్​ (17), విరాట్​ కోహ్లీ (21) స్థానాల్లో కొనసాగుతున్నారు. రోహిత్​, శ్రేయస్​ చెరో స్థానం కోల్పోగా.. కోహ్లీ రెండు స్థానాలు దిగజారి 21కు చేరాడు. 818 పాయింట్లతో పాకిస్థాన్​కు చెందిన బాబర్​ ఆజామ్​ నెంబర్​వన్​ టీ20 బ్యాటర్​గా ఉన్నాడు. బౌలింగ్​ ర్యాంకింగ్స్​లో భువనేశ్వర్​ కుమార్​, చాహల్​ తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. భూవీ ఏడు స్థానాలు ఎగబాకి 11కు చేరగా.. చాహల్​ నాలుగు స్థానాలు మెరుగుపడి 26కు చేరాడు. ఆస్ట్రేలియాకు చెందిన జాష్​ హేజిల్​వుడ్​ 792 పాయింట్లతో ఫస్ట్​ప్లేస్​లో కొనసాగుతున్నాడు. ఉత్తమ టీ20 ఆల్​రౌండర్​గా అఫ్గానిస్థాన్​కు చెందిన మహమ్మద్​ నబీ నిలిచాడు.

టెస్టు ర్యాంకింగ్స్​లో 754 పాయింట్లతో రోహిత్​ శర్మ 7వ స్థానం, 742 పాయింట్లతో కోహ్లీ 10వ స్థానంలో నిలిచి.. టాప్​-10 బ్యాట్స్​మెన్​ల జాబితాలో కొసాగుతున్నారు. ఇంగ్లాండ్​కు చెందిన రూట్​ 897 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగతున్నాడు. బౌలర్లలో 830 పాయింట్లతో బూమ్రా మూడో స్థానానికి చేరగా.. 850 పాయింట్లతో అశ్విన్​ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్​ బౌలర్​గా 901 పాయింట్లతో ఆస్ట్రేలియాకు చెందిన పాట్​ కమిన్స్​ నిలిచాడు. ఆల్​రౌండర్ల జాబితాలో తొలి రెండు స్థానాల్లో స్పిన్​ ద్వయం జడేజా, అశ్విన్​లు నిలిచారు.

వన్డే ర్యాంకింగ్స్​లో 811 పాయింట్లతో విరాట్​ కోహ్లీ, 791 పాయింట్లతో రోహిత్​ శర్మ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. బౌలింగ్​లో 679 పాయింట్లతో బూమ్రా ఒక్కడే టాప్​10లో నిలిచాడు. టాప్​ బ్యాటర్​గా 892 పాయింట్లతో పాకిస్థాన్​కు చెందిన బాబర్​ ఆజామ్​ కొనసాగుతున్నాడు. 726 పాయింట్లతో న్యూజిలాండ్​కు చెందిన ట్రెంట్​ బౌల్ట్​ టాప్​ బౌలర్​గా నిలిచాడు.

ఇదీ చూడండి : మళ్లీ మెరిసిన నీరజ్​ చోప్రా.. ఈసారి జాతీయ రికార్డు కైవసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.