ETV Bharat / sports

టీమ్ఇండియాపై అదరగొట్టి.. ఐసీసీ​ అవార్డుకు ఎంపికై - ఐసీసీ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్ హీథర్​ నైట్​

ICC player of month: జనవరి నెలకుగానూ 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్'​ విజేతను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. దక్షిణాఫ్రికా బ్యాటర్​ కీగన్​ పీటర్సన్​, ఇంగ్లాండ్ మహిళా క్రికెట్​ జట్టు కెప్టెన్​ హీథర్​ నైట్​ ఈ అవార్డు దక్కించుకున్నట్లు తెలిపింది.

ICC player of the month keegan peterson
ఐసీసీ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్
author img

By

Published : Feb 14, 2022, 3:16 PM IST

Updated : Feb 14, 2022, 4:17 PM IST

ICC player of month: ప్రతి నెల అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' పేరిట అవార్డు అందిస్తోంది అంతర్జాతీయ క్రికెట్ మండలి. తాజాగా జనవరి నెలకుగానూ ఈ అవార్డు గ్రహీతను ప్రకటించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్​ కీగన్​ పీటర్సన్​ ఈ అవార్డు దక్కించుకున్నట్లు తెలిపింది. దక్షిణాఫ్రికా ప్లేయర్​ డేవాల్డ్​ బ్రెవిస్​, బంగ్లాదేశ్​ పేసర్​ ఎబాడట్​ హొస్సేన్​తో​ పోటీపడి ఇతడు ఈ పురస్కారాన్ని అందుకున్నాడు.

మహిళల్లో ఇంగ్లాండ్​ కెప్టెన్​ హీథర్​ నైట్​కు ఈ అవార్డు వరించింది. ఈ అవార్డు రేసులో ఉన్న శ్రీలంక కెప్టెన్​ చమరీ(Athapaththu), వెస్టిండీస్​ స్టార్​ డీన్​ద్రా డాటిన్​ను వెనక్కినెట్టి విజేతగా నిలిచింది.

టీమ్​ఇండియాపై 2-1తేడాతో సిరీస్​ను కైవసం చేసుకుంది దక్షిణాఫ్రికా. ఈ సిరీస్​లోని రెండో మ్యాచులో 62, 28 పరుగులు, మూడో మ్యాచులో 72,82 రన్స్​ చేసి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు పీటర్సన్​. మొత్తంగా ఈ సిరీస్​లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి ప్లేయర్​ ఆఫ్​ ది సిరీస్​ అవార్డును దక్కించుకున్నాడు. ఇటీవలే యాషెస్​ సిరీస్​లో భాగంగా ఆస్ట్రేలియాపై జరిగిన ఏకైక టెస్టులో హీథర్​ నైట్​ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్​గా నిలిచింది. ఈ మ్యాచ్​లో 168, 48 పరుగులు చేసింది. ఈ మ్యాచ్​ డ్రాగా ముగిసింది. ఈ ప్రదర్శన వల్లే వీరిద్దరికి ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​ అవార్డును ప్రకటించినట్లు ఐసీసీ తెలిపింది.

ఇదీ చూడండి: యువ క్రికెటర్​ ఇ'షాన్​​దార్'​ గర్ల్​ఫ్రెండ్​!

Last Updated : Feb 14, 2022, 4:17 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.