ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో(ICC ODI Rankings) టీమ్ఇండియా కెప్టన్ మిథాలీ రాజ్(Mithali Raj Ranking) మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఈసారి తొలి ర్యాంకును దక్షిణాఫ్రికాకు చెందిన లిజెల్లి లీ తో కలిసి పంచుకుంది. వీరిద్దరూ 762 పాయంట్లతో బ్యాటింగ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన అలీసా హేలీ మూడో స్థానంలో ఉండగా.. భారత స్టార్ బ్యాట్స్‌వుమన్ స్మృతి మంధాన(Smriti Mandhana ODI Ranking) 9వ ర్యాంకులో కొనసాగుతుంది. బ్యాటింగ్ జాబితాలో దక్షిణాఫ్రికాకు చెందిన లిజెల్లి లీ.. తొలి ర్యాంకుకు చేరుకోవడం ఇది మూడోసారి.
బౌలింగ్ ర్యాంకుల్లో భారత వెటరన్ పేసర్ జూలన్ గోస్వామి(Jhulan Goswami ICC Ranking), సీనియర్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ వరుసగా ఐదో, 9వ ర్యాంకుల్లో నిలిచారు. అదే విధంగా ఆల్‌రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ 5వ ర్యాంకులో కొనసాగుతుంది.
టీ20 ర్యాంకింగ్స్‌లో..
మహిళల టీ20 ర్యాంకుల్లో భారత బ్యాట్స్‌వుమన్ షెఫాలీ వర్మ(Shafali Verma Ranking) 759 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాతుండగా.. మూడో ర్యాంకులో స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana Ranking) 716 పాయింట్లతో నిలిచింది.
మరోవైపు బౌలింగ్ ర్యాంకుల్లో మార్పేది జరగలేదు. దీప్తీ శర్మ(Deepti Sharma) 6వ స్థానంలోనే కొనసాగుతుండగా.. పూనమ్ యాదవ్(Poonam Yadav) కోల్పోయి 8వ ర్యాంకుకు పరిమితమైంది.
ఇదీ చూడండి.. ప్రపంచకప్‌కు ముందే పాక్ సీనియర్ క్రికెటర్ రిటైర్మెంట్!