ETV Bharat / sports

ICC ODI Ranking Team 2023 : వన్డే ర్యాంకింగ్స్​లో ఆస్ట్రేలియా​ టాప్.. భారత్ ప్లేస్ ఎంతంటే? - పాకిస్థాన్ వన్డే ర్యాంకింగ్

ICC ODI Ranking Team 2023 : ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్​లో ఆస్ట్రేలియా అగ్ర స్థానం సొంతం చేసుకుంది. ఇంకా ఏయే టీమ్స్​ ఏ స్థానాల్లో ఉన్నాయంటే ?

ICC Odi Ranking
ICC Odi Ranking
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 11:05 AM IST

Updated : Sep 10, 2023, 11:34 AM IST

ICC ODI Ranking Team 2023 : ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) ఆదివారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్​లో.. ఆస్ట్రేలియా టాప్​లోకి దూసుకెళ్లింది. 121 పాయింట్లతో ఆసిస్.. పాకిస్థాన్​ (120 పాయింట్ల)ను వెనక్కినెట్టి అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. ఇక 114 పాయింట్లతో భారత్.. మూడో స్థానంలో కొనసాగుతోంది.

గతేడాది శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన ఆసీస్​.. ఆ తర్వాత వేగం పుంజుకుంది. అసాధారణ ఆటతీరుతో ఆ తర్వాత సొంత గడ్డపై .. న్యూజిలాండ్ (3-0), ఇంగ్లాండ్​ (3-0)ను క్లీన్​స్వీప్​ చేసింది. ఈ ఏడాది భారత్ పర్యటనలో కూడా 2-1 తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న ఆసిస్.. తాజాగా రెండు వరుస విజయాలు నమోదు చేసి.. నెం 1 జట్టుగా నిలిచింది. అయితే రెండో ప్లేస్​లో ఉన్న పాకిస్థాన్.. ఆసియాకప్​లో ఇంకా మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. దీంతో మళ్లీ ర్యాంక్ మారే అవకాశాలు ఉన్నాయి.

టాప్​ 5లో ఉన్న జట్లు

  • రెండో స్థానం.. పాకిస్థాన్ 120 పాయింట్లు
  • మూడో స్థానం.. భారత్ 114 పాయింట్లు
  • నాలుగో స్థానం. న్యూజిలాండ్ 106 పాయింట్లు
  • ఐదో స్థానం.. ఇంగ్లాండ్ 99 పాయింట్లు

Australia Tour Of South Africa 2023 : 5 వన్డేలు, మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​ కోసం ఆస్ట్రేలియా.. గతనెల సౌతాఫ్రికా పయనమైంది. ఈ పర్యటనలో ఆసిస్​.. ఆతిథ్య జట్టుపై పూర్తి ఆధిపత్యం చలాయిస్తోంది. ఇప్పటికే మొదలైన మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​ను ఆసిస్ 3-0తో కైవసం చేసుకుంది. రీసెంట్​గా ప్రారంభమైన వన్డేల్లోనూ అదే జోరు కనబరుస్తోంది.

Aus vs Sa 2nd ODI : శనివారం ఇరుజట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసిస్.. 50 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. ఆరంభం నుంచే సౌతాఫ్రికా బౌలర్లపై ఆసిస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (106), ట్రావిస్ హెడ్ (64) విరుచుకుపడ్డారు. తర్వాత ఆ విధ్వంసాన్ని లబుషేన్ (124 పరుగులు : 99 బంతుల్లో 19x4, 1x6) కొనసాగించాడు.

అనంతరం 393 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా తడబడింది. ఆసిస్ బౌలర్ల ధాటికి 41.5 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికాకు మంచి ఆరంభం లభించినా.. వికెట్లు కోల్పోవడం వల్ల ఆతిథ్య జట్టుకు ఓటమి తప్పలేదు. సౌతాఫ్రికా బ్యాటర్లలో డికాక్ (45), బవూమా (46), క్లాసెన్ (49), డేవిడ్ మిల్లర్ (49) రాణించారు. ఆసిస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4, హర్డీ, ఎల్లీస్, అబాట్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

  • While you were sleeping, Marnus Labuschagne and David Warner were busy scoring big hundreds!

    Our Aussie men cruised to a 123-run victory at Manguang Oval after posting the second highest ever ODI total at the venue #SAvAUS pic.twitter.com/iMFdFwhFjq

    — Cricket Australia (@CricketAus) September 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Australia Vs South Africa : ఆసిస్​ జట్టు శుభారంభం.. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ దుమ్మురేపాడుగా..

Latest ODI Rankings : అదరగొట్టిన టీమ్​ఇండియా యంగ్ ప్లేయర్స్​.. కెరీర్​ బెస్ట్ రేటింగ్ పాయింట్స్​తో

Last Updated : Sep 10, 2023, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.