ICC ODI Ranking 2023 : ఐసీసీ బుధవారం వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేసింది. తాజా ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (823 రేటింగ్స్).. టాప్‌లో ఉన్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ (829 రేటింగ్స్)కు అతి చేరువలోకి వచ్చాడు. వీరిద్దరూ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ హెన్రీచ్ క్లాసెన్ ఏకంగా ఏడు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. ప్రస్తుతం అతడు 756 రేటింగ్స్‌తో నాలుగో ప్లేస్ దక్కించుకున్నాడు. మరో సౌతాఫ్రికా ప్లేయర్ క్వింటన్ డికాక్.. 769 రేటింగ్స్‌తో మూడో స్థానంలో ఉండగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (747 రేటింగ్స్) ఐదో స్థానం, కెప్టెన్ రోహిత్ శర్మ (725 రేటింగ్స్) ఎనిమిదో ప్లేస్‌లో కొనసాగుతున్నారు.
ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్.. (747 రేటింగ్స్) విరాట్‌తో కలిసి ఐదో స్థానంలో ఉన్నాడు. సౌతాఫ్రికా బ్యాటర్ రస్సీ వాన్ డర్ డస్సెన్ (716 రేటింగ్స్) నాలుగు స్థానాలు దిగజారి తొమ్మిదో ర్యాంక్‌కు పడిపోయాడు. ఇక ఇటీవలె ప్రపంచకప్‌లో భారత్‌పై సూపర్ సెంచరీతో చెలరేగిన డ్యారిల్ మిచెల్.. 16 స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. ప్రస్తుతం మిచెల్ (668 రేటింగ్స్)తో 13వ ప్లేస్ దక్కించుకున్నాడు. ఇక టాప్ 10లో భారత్ నుంచి ముగ్గురు, సౌతాఫ్రికా నుంచి ముగ్గురు ఆటగాళ్లు ఉండడం విశేషం.
టాప్ పొజిషన్‌కు అతి చేరువలో సిరాజ్.. బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హజెల్‌వుడ్ 670 రేటింగ్స్‌తో అగ్రస్థానంలో ఉండగా.. టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ 668 రేటింగ్స్‌తో, కేవలం రెండు పాయింట్ల తేడాతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సౌతాఫ్రికా బౌలర్ కేశవ్ మహరాజ్.. (656 రేటింగ్స్) కెరీర్ బెస్ట్ ర్యాంక్ దక్కించుకున్నాడు. అతడు మూడో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇక టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (632 రేటింగ్స్) తొమ్మిదో స్థానం, పేసర్ జస్ప్రీత్ బుమ్రా (620 రేటింగ్స్) 13వ ప్లేస్‌లో ఉన్నారు.
ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్.. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఈ లిస్ట్‌లో (324 రేటింగ్స్) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య.. 219 రేటింగ్స్‌తో తొమ్మిదో ప్లేస్‌లో ఉన్నాడు. కాగా, టీమ్ఇండియా నుంచి ఈ జాబితాలో హార్దిక్ ఒక్కడే ప్లేస్ దక్కించుకున్నాడు.
-
The race to overtake Babar Azam at the top of the @MRFWorldwide ODI Batter Rankings just got a lot tighter 👀#CWC23https://t.co/uJ7MpsFKur
— ICC (@ICC) October 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The race to overtake Babar Azam at the top of the @MRFWorldwide ODI Batter Rankings just got a lot tighter 👀#CWC23https://t.co/uJ7MpsFKur
— ICC (@ICC) October 25, 2023The race to overtake Babar Azam at the top of the @MRFWorldwide ODI Batter Rankings just got a lot tighter 👀#CWC23https://t.co/uJ7MpsFKur
— ICC (@ICC) October 25, 2023
ICC Rankings: వన్డేల్లో బుమ్రా మళ్లీ నంబర్ వన్.. టీ20లో 5వ స్థానానికి సూర్య