ETV Bharat / sports

ఐసీసీ కొత్త ఛైర్మన్​గా దాదా ఎంపిక ఖరారైనట్లేనా?

ICC New Chairman Ganguly: ఐసీసీ కొత్త ఛైర్మన్​గా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా బోర్డు స్పందించలేదు.

ICC New chairman Ganguly
ఐసీసీ కొత్త ఛైర్మన్​గా దాదా
author img

By

Published : Jul 27, 2022, 5:26 PM IST

ICC New Chairman Ganguly: ఐసీసీ కొత్త ఛైర్మన్​గా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఎంపిక దాదాపు ఖరారైందని తెలుస్తోంది. ఇంగ్లీష్​ వెబ్​సైట్లు ఈ విషయాన్ని ప్రచురిస్తున్నాయి. సోషల్​మీడియాలోనూ ఈ ప్రచారం సాగుతోంది. రేసులో బీసీసీఐ కార్యదర్శి జై షా, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్​ ఠాకూర్​ పేర్లు ప్రముఖంగా వినిపించినా అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశాయి. అయితే ఈ విషయమై బీసీసీఐ వర్గాలు స్పందించలేదు. అధ్యక్ష ఎన్నికకు సమయం చాలా ఉందని, ఇప్పటి నుంచే ఆ చర్చ ఎందుకుని ఓ బోర్డు అధికారి అన్నారు.

కాగా, ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్​ గ్రెగ్​ బార్ల్కే(న్యూజిలాండ్​) పదవీకాలం.. ఈ ఏడాది నవంబరుతో ముగియనుండటం వల్ల ఆ పదవి ఎవరిని వర్తిస్తుందోనని క్రికెట్​ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. గతంలో ఈ పదవిలో నలుగురు భారతీయులు పనిచేశారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగ్మోహన్​ దాల్మియా, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్, చెన్నై సూపర్ కింగ్స్ అధినేత శ్రీనివాసన్, సీనియర్ న్యాయవాది శశాంక్ మనోహర్‌ ఐసీసీ చైర్మన్‌ హోదాలో పని చేశారు.

ఇదీ చూడండి: అభిమానులతో సూర్య, రోహిత్‌, పంత్‌ ముచ్చట్లు.. లైవ్​లోకి ధోనీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.