ICC Men's Test Team of the Year 2021: ఐసీసీ.. 2021 ఏడాదికి అత్యుత్తమ టెస్టు జట్టును కూడా ప్రకటించింది. టీ20, వన్డేలో చోటు దక్కని భారత ఆటగాళ్లకు.. టెస్టు టీమ్‌లో స్థానం లభించింది. రోహిత్ శర్మ, రిషభ్ పంత్, అశ్విన్ ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
హిట్‌మ్యాన్.. 2021లో 47.68 సగటుతో 906 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఒకటి స్వదేశంలో ఇంగ్లాండ్‌పై.. రెండోది విదేశీ గడ్డ ఓవల్‌పై ఈ శతకాలు సాధించాడు. ఈ కారణంగా అతడిని జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది ఐసీసీ. పంత్, అశ్విన్ కూడా అద్భుతంగా ఆడారని కితాబిచ్చింది. కీలక సమయాల్లో బాగా రాణించారని వెల్లడించింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్‌పై న్యూజిలాండ్ విజయం సాధించింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు మ్యాచులు ఆడి 65.83 సగటుతో 395 పరుగులు చేశాడు. దీంతో అతడికి కెప్టెన్‌గా అవకాశం ఇచ్చినట్లు తెలిపింది ఐసీసీ.
దిముత్ కరుణారత్నె(శ్రీలంక), మార్నస్ లబుషేన్(ఆస్ట్రేలియా), జోరూట్(ఇంగ్లాండ్), ఫవద్ అలమ్(పాకిస్థాన్), కైల్ జెమీసన్(న్యూజిలాండ్), హసన్ అలీ(పాకిస్థాన్), షహీన్ అఫ్రిదికి(పాకిస్థాన్) కూడా జట్టులో స్థానం కల్పించింది.
ఇదీ చూడండి: