ETV Bharat / sports

ఐసీసీ ప్లేయర్​ ఆప్​ ది మంత్​ రేసులో వీరే! - బాబర్ అజామ్​

ICC Player of the Month March: మార్చి నెలకు సంబందించి ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​ నామినేషన్లను ప్రకటించింది ఐసీసీ. ఈ జాబితాలో పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​ సహా మరో ఇద్దరు ఉన్నారు. మహిళల విభాగంలోనూ ముగ్గురిని ఎంపిక చేసింది.

ICC-AWARD
బాబర్​ అజామ్​
author img

By

Published : Apr 6, 2022, 3:51 PM IST

ICC Player of the Month March: అంతర్జాతీయ క్రికెట్​ మండలి మార్చి నెలకు సంబంధించి ప్లేయర్​ ఆప్​ ది మంత్​ జాబితాను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాళ్లను గుర్తించి ప్రతి నెల అవార్డులను ఇస్తుంటుంది ఐసీసీ. అందులో భాగంగానే మార్చి నెల కోసం టాప్​ ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది.

పురుషుల విభాగం: మార్చి నెలలో అద్భుత ప్రదర్శన చేసిన పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​, వెస్టిండీస్​ సారథి క్రెయిగ్​ బ్రాత్​వైట్​, ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్​ పాట్​ కమిన్స్​ పేర్లను నామినేట్​ చేసినట్లు ఐసీసీ వెల్లడించింది. సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్​ సీరిస్​లో పాక్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​ అద్భుత ప్రదర్శన చేశాడు. అజేయ సెంచరీతో 390 పరుగులు చేసి ఈ జాబితాలో ముందున్నాడు. రెండు వన్డేల్లోనూ మంచి ప్రదర్శన చేశాడు.

మహిళల కేటగిరీ: ఇటీవల జరిగిన మహిళల ప్రపంచ కప్​లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్ను ముగ్గురిని ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​కు నామినేట్​ చేసినట్లు ఐసీసీ ప్రకటించింది. అందులో ఇంగ్లాండ్​ బౌలర్​ సోఫీ ఎక్లెస్టోన్​, ఆస్ట్రేలియా రన్​ మిషన్​ రాచెల్​ హె​న్స్​, దక్షిణాఫ్రికాకు చెందిన లౌరా వోల్వార్డ్​టో​ ఉన్నారు. వచ్చే వారం విజేతలను ప్రకటించనుంది.

ఇదీ చూడండి: ఇప్పటికీ.. ఎప్పటికీ.. ఆయనే నాకు స్ఫూర్తి: రోహిత్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.