Latest ODI Rankings : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా వన్డే ర్యాకింగ్స్‌ను విడుదల చేసింది. ఇందులో టీమ్ఇండియా బ్యాటర్లు శభమన్ గిల్, ఇషాన్ కిషన్ అదరగొట్టారు. నాలుగో స్థానంలో ఉన్న గిల్(shubman gill latest odi ranking).. ఆసియాకప్-2023లో భాగంగా నేపాల్‌పై జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి తన స్ధానాన్ని మెరుగుపరుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గిల్ 62 బంతుల్లో హాఫ్ సెంచరీ 67 అజేయ పరుగులు చేశాడు. 750 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. గిల్ వన్డే కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంకు.
ఇక పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్(ishan kishan odi ranking) ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 24వ స్థానానికి చేరుకోవడం విశేషం. కెరీర్ బెస్ట్ మార్క్ రేటింగ్ పాయింట్స్ 624ను అందుకున్నాడు. పాకిస్థాన్‌పై అతడు 82 పరుగులతో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి ఈ మార్క్‌ను అందుకున్నాడు. ఇక ఈ విభాగంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 882 పాయింట్లు అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్ధానంలో దక్షిణాఫ్రికా స్టార్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ నిలిచాడు. పదో స్థానంలో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ(virat kohli latest odi ranking) నిలవగా.. కెప్టెన్ రోహిత్ శర్మ 11వ స్థానంలో కొనసాగుతున్నాడు.
Latest ODI Bowling Rankings :బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హాసన్ రెండు స్థానాలు ఎగబాకి 624 పాయింట్లతో 10వ స్థానానికి, శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ ఐదు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకుకు చేరుకున్నారు. ఆస్ట్రేలియా ప్లేయర్స్ జోష్ హెజిల్వుడ్(705 పాయింట్లు), మిచెల్ స్టార్క్(686 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లోనే కొనసాగుతున్నారు. ఎనిమిదో స్థానంలో టీమ్ఇండియా ప్లేయర్ మహ్మద్ సిరాజ్ 652 పాయింట్లతో కొనసాగుతున్నాడు.
టాప్ 10 వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్ పూర్తి జాబితా ఇదే..
1.బాబర్ అజామ్ (పాకిస్థాన్)
2.రస్సీ వాండర్ డస్సెన్ (దక్షిణాఫ్రికా)
3.శుభమన్ గిల్(టీమ్ఇండియా)
4.ఇమామ్-ఉల్-హక్ (పాకిస్థాన్)
5.హ్యారీ టెక్టర్ (ఐర్లాండ్)
6.డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)
7.ఫఖర్ జమాన్ (పాకిస్థాన్)
8.క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా)
9.స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)
10.విరాట్ కోహ్లీ (టీమ్ఇండియా)
Virat Kohli 2023 World Cup : కింగ్ కోహ్లీ.. ఆ ఘనత సాధించిన ఒక్కే ఒక్కడు