ETV Bharat / sports

స్టంపౌట్ రివ్యూ రూల్​లో ఐసీసీ కీలక మార్పు- ఇక నుంచి అలా చేయడం కుదరదు! - ఐసీసీ కంకషన్ నిబంధన

ICC Changed Stump Out Rule : స్టంపౌట్ అప్పీళ్లకు వర్తించే నిబంధనల్లో కీలక మార్పులు చేసింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్- ఐసీసీ. దీంతో పాటు కంకషన్​ సబ్‌స్టిట్యూట్‌ నిబంధనపై మరింత స్పష్టతనిచ్చింది.

ICC Stump Out Rule
ICC Stump Out Rule
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 4, 2024, 2:27 PM IST

Updated : Jan 4, 2024, 3:58 PM IST

ICC Changed Stump Out Rule : క్రికెట్ రూల్స్​లో పలు కీలక మార్పులు చేసింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ). వికెట్‌ కీపర్‌ చేసే స్టంపౌట్​ అప్పీళ్లపై నిబంధనలను సవరించింది. దీని ప్రకారం స్టంపౌట్​ అప్పీళ్ల రివ్యూ సమయంలో థర్డ్​ అంపైర్​ స్టంపౌట్​ను మాత్రమే చెక్​ చేయాల్సి ఉంటుంది. క్యాచ్ ఔట్​ను చెక్ చేయకూడదు. స్టంపౌట్​ను స్పష్టంగా చూపించే సైడ్ ఇమేజ్ రీప్లేలను మాత్రమే అంపైర్ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన గతేడాది 12 నుంచే అమల్లోకి వచ్చినట్టు ఐసీసీ తెలిపింది.

ఇంతకుముందు వరకు ఇలాంటి అప్పీళ్లపై స్టంపౌట్​తో పాటు బంతి బ్యాట్​కు తాకిందా లేదా అనే విషయాన్ని కూడా థర్డ్​ అంపైర్​ పరిశీలించేవారు. ఏదైనా టీమ్ స్టంపౌట్​ అప్పీల్ చేస్తే థర్డ్ అంపైర్- స్టంపౌట్​తో పాటు క్యాచ్​ను సైతం చెక్ చేసేవారు. ఒకవేళ బ్యాట్​కు బంతి తగిలి కీపర్ క్యాచ్​ పడితే ఔట్​ ఇచ్చేవారు. దీంతో బౌలింగ్​ జట్టు ఒకదాని కోసం రివ్యూ కోరి మరో విధంగా లాభపడేది. ఇక ఈ విషయం తెలిసిన కీపర్లు కూడా ఈ లూప్​హోల్​ను ఉపయోగించుకుని తెలివిగా రివ్యూ కోరేవారు. గతేడాది భారత్​తో సిరీస్ సందర్భంగా ఆస్ట్రేలియా కీపర్ అలెక్స్ కేరీ ఇలాగే పదేపదే స్టంపౌట్​కు రివ్యూ కోరాడు. టీమ్ డీఆర్ఎస్​లను వినియోగించుకోకుండానే స్టంపౌట్​ అప్పీల్ చేసి క్యాచ్ ఔట్ రివ్యూలు సైతం తీసుకున్నాడు. ఈ విధానంతో బ్యాటింగ్​ టీమ్​కు నష్టం జరిగేది. ఇప్పుడు మాత్రం టీవీ అంపైర్​ అవేవీ చెక్​ చేయకుండా- కీపర్ సరిగ్గా స్టంపౌట్​ చేశాడా, బ్యాటర్ క్రీజులోనే ఉన్నాడా లేదా అనేది మాత్రమే పరిశీలించాల్సి ఉంటుంది.

ఈ స్టంపౌట్‌ రిఫరల్స్‌ నిబంధనలతో పాటు కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ నిబంధనలలో మరింత స్పష్టతనిచ్చింది ఐసీసీ. కంకషన్​కు గురైన ప్లేయర్​పై బౌలింగ్ నిషేధం ఉంటే అతడి స్థానంలో వచ్చే సబ్​స్టిట్యూట్​ను బౌలింగ్​కు అనుమతించరని ఐసీసీ స్పష్టం చేసింది. దీంతో పాటు మైదానంలో గాయపడ్డ ప్లేయర్​కు చికిత్స కోసం నిర్దేశించిన సమయాన్ని నాలుగు నిమిషాలకు పరిమితం చేసింది.

Last Updated : Jan 4, 2024, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.