అంతర్జాతీయ క్రికెట్ మండలి శాశ్వత సీఈఓగా(Icc ceo 2021) జెఫ్ అలార్డైస్(Geoff Allardyce) నియమితులయ్యారు. ఎనిమిది నెలలకు పైగా ఐసీసీ తాత్కాలిక సీఈఓగా ఉన్న ఆయనకు శాశ్వతంగా ఆ పదవీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఐసీసీ(Icc news) ఆదివారం ప్రకటించింది. తనను శాశ్వత సీఈఓగా నియమించడం పట్ల జెఫ్ హర్షం వ్యక్తం చేశారు.
"ఐసీసీ సీఈఓగా నియమితులవ్వడం చాలా గౌరవప్రదమైన విషయం. ఈ అరుదైన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్‌తో పాటు, ఐసీసీ బోర్డుకు ధన్యావాదాలు. సుదీర్ఘ విజయాన్ని కొనసాగించేందుకు బోర్డు సభ్యులతో సన్నిహితంగా పని చేస్తాను. గత ఎనిమిది నెలలుగా నాకు మద్దతుగా నిలిచిన ఐసీసీ సిబ్బందికి కృతజ్ఞతలు. ప్రతిభావంతులైన ఈ బృందంతో కలిసి క్రికెట్ సేవను కొనసాగించేందుకు కృషి చేస్తాను."
-జెఫ్ అలార్డైస్, ఐసీసీ సీఈఓ
ఆస్ట్రేలియా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన జెఫ్.. ఎనిమిదేళ్ల పాటు ఐసీసీ క్రికెట్ జనరల్ మేనేజర్‌గా వ్యవహరించారు. అంతకుముందు క్రికెట్ ఆస్ట్రేలియాలోనూ ఆయన ఇదే పదవిలో సేవలందించారు.
కాగా, ఐసీసీ సీఈఓగా శాశ్వతంగా కొనసాగేందుకు జెఫ్ ఒప్పుకోవడం పట్ల తనకు సంతోషంగా ఉందని ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే పేర్కొన్నారు. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ టోర్నీని నిర్వహించడంలోనూ సమర్థంగా పని చేశారని ప్రశంసించారు.
ఇదీ చూడండి: