ETV Bharat / sports

'నా కెరీర్​ రూపకల్పనలో అతడిదే ప్రధాన పాత్ర'

తన కెరీర్ రూపకల్పనలో న్యూజిలాండ్ మాజీ బౌలర్​, ముంబయి ఇండియన్స్ బౌలింగ్ కోచ్​ షేన్ బాండ్ ప్రధాన పాత్ర పోషించాడని తెలిపాడు భారత బౌలర్​ జస్ప్రీత్ బుమ్రా. బాండ్​తో మంచి అనుబంధం ఉందని.. మున్ముందు కూడా అది కొనసాగుతుందని పేర్కొన్నాడు.

jasprit bumrah, team india bowler
జస్ప్ర్రీత్ బుమ్రా, టీమ్​ఇండియా బౌలర్
author img

By

Published : May 14, 2021, 2:02 PM IST

తన​ కెరీర్​ను తీర్చిదిద్దడంలో కివీస్​ మాజీ బౌలర్​ షేన్ బాండ్ ప్రముఖ పాత్ర పోషించాడని టీమ్​ఇండియా పేసర్​ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. బాండ్ ప్రస్తుతం ముంబయి ఇండియన్స్​కు బౌలింగ్​ కోచ్​గా వ్యవహరిస్తున్నాడు.

రానున్న ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​లో భారత బౌలింగ్​ దళానికి నాయకత్వం వహించనున్న బుమ్రా.. తన అభిప్రాయాలను ఓ వీడియో ద్వారా వెల్లడించాడు.

"నేను ఎక్కడ ఉన్నా.. షేన్ బాండ్​తో మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. అతడి నుంచి ఎప్పుడూ ఏదో కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాను. ప్రతి ఏడాది నా బౌలింగ్​లో కొత్త అస్త్రాలను జోడించడానికి ప్రయత్నిస్తుంటాను. ఇప్పటివరకు అతడితో గొప్ప అనుబంధం ఉంది. ఇది మున్ముందు కూడా కొనసాగుతుంది. నా కెరీర్​ను తీర్చిదిద్దడంలో బాండ్ ప్రముఖ పాత్ర పోషించాడు."

-జస్ప్రీత్ బుమ్రా, టీమ్​ఇండియా బౌలర్.

బాండ్​ న్యూజిలాండ్​కు ఆడే రోజుల్లో ఎలా బౌలింగ్ చేసేవారనే విషయంపై ఎక్కువగా దృష్టి సారిస్తానని బుమ్రా తెలిపాడు. టీమ్​ఇండియాతో ఉన్నప్పటికీ.. బాండ్​తో సంబంధాలు కొనసాగిస్తుంటానని పేర్కొన్నాడు. బాండ్​ బౌలింగ్​ను 2015లో మొదటి సారి చూసినట్లు జస్ప్రీత్ వెల్లడించాడు. కివీస్​ కోసం అతడు బౌలింగ్ చేసే విధానాన్ని చూసి ఆకర్షితుడైనట్లు చెప్పాడు.

బుమ్రా ఇప్పటి వరకు భారత్ తరఫున 19 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. బుమ్రా వంటి సహచర బౌలర్​ ఉంటే డెత్​ ఓవర్లలో తమ పని సులువు అవుతుందని కివీస్​ బౌలర్​ బౌల్ట్​.. ఇది వరకే ప్రశంసించాడు.

ఇదీ చదవండి: 'ఆ విషయంలో స్పందించేందుకు మాటలు రావట్లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.