ETV Bharat / sports

నా తప్పులే నన్ను సెంచరీకి దూరం చేశాయి.. నేను రికార్డుల కోసం ఆడను : కోహ్లీ - border gavaskar trophy 2023

Virat Kohli Rahul Dravid Interview : టెస్టుల్లో మూడేళ్లపాటు సెంచరీ చేయకపోవడం తనను బాధించిందని టీమ్‌ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. నాలుగో టెస్టు మ్యాచ్ అనంతరం భారత ప్రధాన కోచ్​ రాహుల్​ ద్రవిడ్​తో చిట్​ చాట్​ చేసిన విరాట్ కోహ్లీ.. ఈ వ్యాఖ్యలు చేశాడు.

virat kohli rahul dravid
virat kohli rahul dravid
author img

By

Published : Mar 14, 2023, 8:01 PM IST

Virat Kohli Rahul Dravid Interview : సుమారు 1200 రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్​లో సెంచరీ చేశాడు టీమ్​ఇండియా స్టార్​ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఇటీవలే బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్​లో 186 పరుగులతో భారీ శతకం కొట్టాడు. దీంతో టెస్టుల్లో 28వ శతకం నమోదు చేశాడు. ఆ టెస్టు డ్రాగా ముగియడం వల్ల ట్రోఫీని 2-1 తేడాతో సొంతం చేసుకుంది భారత్​. అయితే ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం భారత ప్రధాన కోచ్​ రాహుల్​ ద్రవిడ్​తో చిట్​ చాట్​ చేశాడు విరాట్ కోహ్లీ. ఈ సందర్భంగా కోహ్లీతో మాట్లాడిన ద్రవిడ్​.. 'మూడేళ్ల పాటు టెస్టుల్లో సెంచరీ చేయకపోవడం కష్టంగా అనిపించిందా' అని ప్రశ్నించాడు.

"నిజంగా చెప్పాలంటే.. నా సొంత తప్పిదాలే చాలా కాలంపాటు నన్ను సెంచరీకి దూరంగా ఉండేలా చేశాయి. మూడంకెల మార్క్‌ని సాధించాలనే తపన ఒక బ్యాటర్‌గా మీలో కూడా ఉంటుందని అనుకుంటున్నా. మనమందరం ఏదో ఒక దశలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాం. కానీ నా విషయంలో మాత్రం అది కాస్త ఎక్కువ కాలంపాటు కొనసాగిందని భావిస్తున్నా. నేను 40 లేదా 45 పరుగులతో సంతోషంగా ఉండే ఆటగాడిని కాదు. ఈ మ్యాచ్‌లో నేను 40 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇక్కడ 150 పరుగులు చేయగలనని.. ఆ పరుగులు నా జట్టుకు చాలా ఉపయోగపడతాయని తెలుసు. ఇలాంటి క్లిష్టమైన సమయాల్లో జట్టు కోసం మంచి ప్రదర్శన చేసినపప్పుడల్లా నేను ఎంతో గర్వపడతాను"

---విరాట్ కోహ్లీ, టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​

రికార్డులు, మైలురాళ్ల కోసం తాను ఎప్పుడూ ఆడనని.. వాటి గురించి అసలు పట్టించుకోనని చెప్పాడు కింగ్​ విరాట్ కోహ్లీ. "మూడేళ్ల పాటు టెస్టుల్లో సెంచరీ చేయకపోవడం నన్ను చాలా బాధించింది. అందరూ నా సెంచరీ గురించే మాట్లాడేవారు. అలాంటి వారందరికీ నేను ఎల్లప్పుడూ చెప్పేది ఒక్కటే.. జట్టు కోసం వీలైనంత ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయడం, ఎక్కువ పరుగులు చేయడం నా ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే సెంచరీ కొట్టాలి అనుకుంటా. బస్​ డ్రైవర్​ నుంచి హోటల్​ బాయ్​, లిఫ్ట్​లో ఉన్న వ్యక్తి వరకు ప్రతి ఒక్కరూ సెంచరీ కావాలని అడిగారు. అది నాకు కొంత ఇబ్బంది కలిగించింది." అని చెప్పాడు విరాట్ కోహ్లీ.

ఆసీస్​ ఆటగాళ్లకు జెర్సీ ఇచ్చిన కోహ్లీ
మరోవైపు బోర్డర్​-గావస్కర్ ట్రోఫీలో చివరిదైన నాలుగో టెస్టు ముగియగానే ఆసీస్‌ వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కెరీ, బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖవాజా వద్దకు వెళ్లాడు విరాట్‌ కోహ్లీ. వారిని పలకరించి.. తన జెర్సీలను వారికి బహుమతిగా ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో తాజాగా బయటకు రాగా.. కోహ్లీ ప్రవర్తనను క్రికెట్‌ అభిమానులు మెచ్చుకుంటున్నారు.

Virat Kohli Rahul Dravid Interview
ఆసీస్ ఆటగాడికి జెర్సీ ఇస్తున్న కోహ్లీ

ఇవీ చదవండి : సచిన్​, ధోనీ, కోహ్లీ కన్నా అతడే టాప్​.. వరల్డ్​ రిచ్చెస్ట్ క్రికెటర్స్​ వీరే..!

వన్డేలకు మొయిన్​ అలీ రిటైర్మెంట్​..! హింట్​ ఇచ్చిన ఇంగ్లాండ్ స్టార్​ ఆల్​రౌండర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.