ETV Bharat / sports

'ధోనీ నిర్ణయాలు తీసుకోవడమేంటి?'- జడేజా షాకింగ్​ కామెంట్స్​! - లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​

Ajay Jadeja Dhoni: చెన్నై సూపర్​ కింగ్స్​ కెప్టెన్​ రవీంద్ర జడేజాకు.. ధోనీ సరైన స్వేచ్ఛను ఇవ్వట్లేదని షాకింగ్​ కామెంట్స్​ చేశాడు భారత మాజీ క్రికెటర్​ అజయ్​ జడేజా. లఖ్​నవూతో మ్యాచ్​లో ధోనీనే కెప్టెన్​లా వ్యవహరించడం నచ్చలేదని అన్నాడు.

author img

By

Published : Apr 2, 2022, 10:44 AM IST

Ajay Jadeja Dhoni: లఖ్‌నవూతో మ్యాచ్‌ సందర్భంగా చెన్నై మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ.. జట్టును నడిపించడం బాగోలేదని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు అజయ్‌ జడేజా అభిప్రాయపడ్డాడు. నూతన కెప్టెన్‌ రవీంద్ర జడేజాకు నేర్చుకునే స్వేచ్ఛ ఇవ్వాలని సూచించాడు. గురువారం లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 211 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయిన నేపథ్యంలోనే మాజీ క్రికెటర్‌ మాట్లాడుతూ ధోనీ తీరును తప్పుబట్టాడు.

''ఈ మ్యాచ్‌లో ధోనీ కెప్టెన్‌లా వ్యవహరించడం తప్పుగా అనిపించింది. ధోనీకి నాకన్నా పెద్ద అభిమాని లేరు. ధోనీ అంటేనే గొప్ప ఆటగాడు. కానీ, ఇక్కడ మనం ఆట గురించి చెప్పుకోవడానికే ఉన్నాం. లఖ్‌నవూతో మ్యాచ్‌లో అతడు కెప్టెన్‌లా వ్యవహరించడం నాకు నచ్చలేదు. చెన్నై కెప్టెన్‌గా తప్పుకోవాలన్నది ధోనీ నిర్ణయమే. అలాంటప్పుడు జడేజాకే పూర్తి స్వేచ్ఛనివ్వాలి. ఫీల్డింగ్‌లో మార్పులు చేస్తూ ధోనీ తీసుకున్న నిర్ణయాలు నాకు సరైనవిగా అనిపించలేదు. అలా చేయడం వల్ల జడేజా ఆత్మవిశ్వాసం దెబ్బతిని ఉంటుంది. అతడు ఈ మ్యాచ్‌లో ఉన్నట్లే అనిపించలేదు'' అని అజయ్‌ జడేజా పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో చెన్నై ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. ఆదివారం పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లోనైనా గెలుపు బాటపట్టాలని పట్టుదలగా ఉంది.

ఇవీ చూడండి: 'నేను ఫాస్ట్​బౌలర్​ను.. అదే నా రహస్యం': రషీద్​ ఖాన్​

200+ లక్ష్యాలూ ఉఫ్​- ఐపీఎల్​లో అత్యుత్తమ ఛేదనలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.