ETV Bharat / sports

'అప్పుడు రవిశాస్తి ఎంత రెడ్ వైన్ తాగాడో!'

ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్​ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది టీమ్ఇండియా. మొదటి మ్యాచ్​లో ఘోర పరాభవం పాలైనా.. పుంజుకుని సిరీస్ సాధించింది. తాజాగా దీనిపై స్పందించిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్.. ఆ సమయంలో రవిశాస్త్రి ఎంత రెడ్ వైన్ తాగి ఉంటాడో తాను ఊహించగలనని తెలిపాడు.

Ravi Shastri, Michael Vaughan
రవిశాస్త్రి, వాన్
author img

By

Published : May 7, 2021, 5:31 PM IST

ఈ ఏడాది ప్రారంభంలో ముగిసిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను 2-1 తేడాతో చిత్తుచేసింది టీమ్ఇండియా. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘోర పరాభవం పాలైనా.. తిరిగి పుంజుకుని సిరీస్ కైవసం చేసుకుంది. మొదటి మ్యాచ్ ఓటమి తర్వాత కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి రాగా అజింక్యా రహానే సారథ్యంలో టీమ్ఇండియా గొప్పగా పోరాడింది. తాజాగా ఈ విజయంపై స్పందించిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్.. భారత జట్టు పోరాడిన తీరును మెచ్చుకున్నాడు. అలాగే ఈ విజయంతో కోచ్ రవిశాస్త్రి ఎంత వైన్ తాగి ఉంటాదో ఊహించుకోగలనని తెలిపాడు.

"ఓటమి తర్వాత భారత జట్టు పుంజుకున్న తీరు, రహానే కెప్టెన్సీ అద్భుతం. గబ్బా మైదానంలో భారత్​కు మంచి రికార్డు లేకున్నా ఆ మ్యాచ్ గెలిచిన తీరు ప్రశంసనీయం. రిషభ్ పంత్ పోరాడిన తీరు అనిర్వచనీయం. ఈ సిరీస్​ మొత్తంలో ఓ కొత్త పంత్ కనిపించాడు. చివరి రెండు మ్యాచ్​ల్లో అయితే బ్రిలియంట్ గేమ్ ఆడాడు. ఆ సమయంలో రవిశాస్త్రి ఎంత రెడ్ వైన్ తాగాడో అర్థం చేసుకోగలను."

-మైఖేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్

అడిలైడ్​లో జరిగిన తొలి టెస్టులో 36 పరుగులకు ఆలౌటైన టీమ్ఇండియా.. వైట్​వాష్​తో తిరిగెళ్తుందని తీవ్ర విమర్శలు వచ్చాయి. ​వాటన్నింటినీ తప్పని నిరూపిస్తూ మెల్​బోర్న్​ టెస్టులో జయకేతనం ఎగవేసింది భారత్. ఆ తర్వాత స్ఫూర్తిమంతమైన పోరాటంతో సిడ్నీ టెస్టును డ్రాగా ముగించింది. చివరగా గబ్బా వేదికగా జరిగిన టెస్టులో మరపురాని గెలుపుతో సిరీస్​ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.