ETV Bharat / sports

Sachin Tendulkar: 'నేను కొవిడ్ జయించడానికి వాళ్లే కారణం' - కొవిడ్​పై సచిన్ తెందుల్కర్

కరోనా నుంచి కోలుకున్న తర్వాత మనిషిగా తాను చాలా మారానని మాస్టర్ బ్లాస్టర్​ సచిన్ చెప్పాడు. మహమ్మారి నుంచి బయటపడటానికి డాక్టర్లు, కుటుంబ సభ్యులు మద్దతుగా నిలిచారని తెలిపాడు.

sachin tendulkar, former indian cricketer
సచిన్ తెందుల్కర్, భారత మాజీ క్రికెటర్
author img

By

Published : Jun 18, 2021, 4:48 PM IST

Updated : Jun 18, 2021, 5:14 PM IST

డాక్టర్లు, కుటుంబ సభ్యుల మద్దత వల్లే కొవిడ్​ను జయించానని దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్(Sachin Tendulkar) చెప్పాడు. వైరస్​ బారిన పడినప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి ఓ టీవీ ఛానల్​లో వెల్లడించాడు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మనిషిగా చాలా మారానని స్పష్టం చేశాడు.

"కరోనాను జయించడం మంచి బౌలర్​ను బ్యాట్స్​మన్​ క్రీజులో ఎదుర్కొవడం లాంటిది. బ్యాట్స్​మన్​ను బయటి నుంచి టీమ్ సభ్యులు మద్దతుగా నిలిచి.. ఉత్సాహపరుస్తారు. అలాగే కొవిడ్​ను నేను ఎదుర్కొనే సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది.. నాకు మద్దతుగా నిలిచారు. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. కొవిడ్ బారిన పడినప్పుడు, నిజం చెప్పాలంటే అంతకంటే ముందే.. నా శరీరం నాకు సహకరించలేదు. నేను కొంత అసౌకర్యానికి గురయ్యాను. కరోనా రిపోర్ట్ రావడానికి ముందే నేను ఐసోలేషన్​లోకి వెళ్లిపోయాను. అది నేను చేసిన మంచి పని"

-సచిన్ తెందుల్కర్, మాజీ క్రికెటర్

అంజలి మద్దతు..

ఆస్పత్రిలో చేరిన తొలి వారం రోజులు చాలా ఇబ్బందిగా అనిపించిందని, ఆరోగ్యం ఇంకా క్షీణించిందని మాస్టర్ బ్లాస్టర్​ గుర్తు చేసుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకు ఆరోగ్యం కుదుటపడిందని తెలిపాడు. డిశ్చార్జ్​ అయిన తర్వాత కూడా తన ఇంట్లో 21 రోజుల పాటు ఐసోలేషన్​లో ఉన్నట్లు పేర్కొన్నాడు. అయితే ఇలా గడపడం చాలా కష్టమని చెప్పాడు. తనకు భార్య అంజలి పూర్తి మద్దతుగా నిలిచిందని సచిన్ తెలిపాడు. ఆమె డాక్టర్​ కావడం వల్ల పరిస్థితులు అర్థం చేసుకునేదని పేర్కొన్నాడు. మహమ్మారి నుంచి కోలుకోవడమనేది పూర్తిగా కష్టమైన విషయమని చెప్పాడు.

మనిషిగా మారాను..

కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తాను చాలా మారానని సచిన్​ చెప్పాడు. ప్రతి మనిషికి విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు తప్పక మారుతాడని తెలిపాడు. ఈ కొవిడ్ అనుభవం తనను చాలా మార్చివేసిందని అన్నాడు.

సచిన్​ తెందుల్కర్​కు మార్చి 27న కొవిడ్ నిర్ధరణ అయింది. తనకు కరోనా సోకిన విషయాన్ని ఏప్రిల్​ 2న ట్విట్టర్​ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

ఇదీ చదవండి:

Sachin: 'గాలిలోనే మ్యాజిక్ చేయొచ్చు'

WTC Final: 'ఇంగ్లాండ్​తో సిరీస్ వల్ల కివీస్​కు లాభం'

WTC final: టాస్ ఆలస్యం.. వర్షం వల్ల తొలి సెషన్ రద్దు

Last Updated : Jun 18, 2021, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.