హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ అయిన మహమ్మద్ అజహరుద్దీన్‌కు ఊరట లభించింది. తిరిగి తన బాధ్యతలు స్వీకరించేందుకు అనుమతినిచ్చారు హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ దీపక్‌వర్మ.
వైస్‌ప్రెసిడెంట్ జాన్ మనోజ్, సెక్రటరీ విజయ్ అనంద్, జాయింట్ సెక్రటరీ నరేష్ శర్మ, ట్రెజరర్(కోశాధికారి) సురేందర్ అగర్వాల్, కౌన్సిలర్ పీ అనురాధను తాత్కాలికంగా వారి బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు మధ్యంతర ఆదేశాలు జారీచేశారు. వీరు హెచ్‌సీఏను అభివృద్ధి చేయకూడదనే దురుద్దేశంతో ఉన్నట్లు ఉన్నారన్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు వీరు తమ పదవులను చేపట్టేది లేదని స్పష్టం చేశారు.
ఇదీ జరిగింది
కొంతకాలం నుంచి అపెక్స్ కౌన్సిల్ సభ్యులు, అజారుద్దీన్ మధ్య విబేధాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే హెచ్‌సీఏ ప్రయోజనాల్ని అజారుద్దీన్ ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అధ్యక్ష పదవితో పాటు హెచ్‌సీఏ సభ్యత్వాన్ని రద్దు చేసింది అపెక్స్ కౌన్సిల్. ఆ తర్వాత లోధా కమిటీ సిఫార్సుల మేరకు జాన్ మనోజ్‌ను నియమించింది. అనంతరం ఈ విషయమై విచారణ చేపట్టిన అంబుడ్స్‌మన్ జస్టిస్ దీపక్‌వర్మ.. అజహరుద్దీన్ తిరిగి తన బాధ్యతలు చేపట్టేలా నిర్ణయం తీసుకుంది.
ఇదీ చూడండి: