Hundred League 2022 Smrithimandana: భారత స్టార్ బ్యాటర్లు స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్ మళ్లీ ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ లీగ్ హండ్రెడ్ టోర్నీలో ఆడబోతున్నారు. మంధానను సదర్న్ బ్రేవ్.. జెమిమాను నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ తిరిగి దక్కించుకున్నాయి. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ షెఫాలీవర్మను వదిలేయగా.. లండన్ స్పిరిట్ జట్టు దీప్తిశర్మ, మాంచెస్టర్ ఒరిజినల్స్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను తిరిగి దక్కించుకోలేదు.
గత టోర్నీలో మంధాన ఏడు ఇన్నింగ్స్‌ల్లో 133.60 సగటుతో 167 పరుగులు చేసింది. వెల్ష్ ఫైర్ జట్టుపై 52 బంతుల్లోనే 78 పరుగులు చేయడం ఈ సీజన్లో మంధాన అత్యుత్తమ ప్రదర్శన. మరోవైపు జెమిమా హండ్రెడ్ టోర్నీలో అదిరే ప్రదర్శన చేసింది. ఆమె అయిదు ఇన్నింగ్స్‌ల్లోనే 60.25 సగటుతో 250 పరుగులు సాధించింది. ఇందులో మూడు అర్ధసెంచరీలు (92, 60, 57) ఉన్నాయి. 43 బంతుల్లోనే 92 పరుగులు చేయడం జెమిమాకు అత్యుత్తమ ప్రదర్శన. సోఫీ డివైన్ (బర్మింగ్‌హామ్ ఫీనిక్స్), లిజెలీ లీ (మాంచెస్టర్ ఒరిజినల్స్), లౌరా వాల్‌వార్డ్ (నార్త్రన్ సూపర్‌ఛార్జర్స్), హీలీ మాథ్యూస్ (వెల్ష్ ఫైర్)తో పాటు మొత్తం పన్నెండు మంది విదేశీ క్రికెటర్లను ఈ సీజన్లో ఫ్రాంఛైజీలు తిరిగి దక్కించుకున్నాయి.
ఇదీ చూడండి: IND vs SL: ఎప్పుడూ మనదే పైచేయి.. మరి ఈసారి?