ETV Bharat / sports

టీమ్​ఇండియా హ్యాట్రిక్​.. మూడోసారి టీ20 వరల్డ్​కప్​ను ముద్దాడిన మనోళ్లు - అంధుల క్రికెట్ వరల్డ్​ కప్​​

భారత అంధుల క్రికెట్​ జట్టు మరో ఘనత సాధించింది. బెంగళూరు వేదికగా జరిగిన మూడో అంధుల క్రికెట్​ వరల్డ్​ ఫైనల్​లో బంగ్లాపై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో వరుసగా మూడు సార్లు ప్రపంచ కప్పును ముద్దాడి హ్యాట్రిక్ రికార్డు సృష్టించింది.

3rd T20 World Cup for blind
అంధుల టీ20 వరల్డ్​కప్​
author img

By

Published : Dec 17, 2022, 4:06 PM IST

Updated : Dec 17, 2022, 5:38 PM IST

భారత క్రికెట్​ చరిత్రలో మరో అద్భతం జరిగింది. టీమ్​ఇండియా.. మూడో అంధుల టీ20 వరల్డ్​ కప్​ను సొంతం చేసుకుంది. బెంగుళూరు చిన్నస్వామీ​ క్రికెట్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్​తో జరిగిన ఫైనల్​లో 120 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ప్రపంచ కప్​ను ముద్దాడింది. దీంతో వరుసగా మూడు సార్లు కప్​ను గెలిచి హ్యాట్రిక్​ నమోదు చేసింది.

3rd T20 World Cup for blind
అంధుల టీ20 వరల్డ్​కప్​

మొదట టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న టీమ్ఇండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. సునీల్​ రమేశ్ (136*), అజయ్​ కుమార్​ రెడ్డి(100*) చేలరేగి పోయారు. ఓపెనర్లు లలిత్​ మీనా(0), వెంకటేశ్వర రావు(10) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్​ సల్మాన్​(2) వికెట్లు పడగొట్టాడు.

3rd T20 World Cup for blind
అంధుల టీ20 వరల్డ్​కప్​

ఆ తర్వాత బరిలోకి దిగిన బంగ్లాదేశ్​.. మొదటి నుంచే తడబడింది. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 157 పరుగుల వద్ద కుప్ప కూలింది. బౌలింగ్​లో రాణించిన సల్మాన్.. (77*) పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఎండీ ఆశికర్ రహ్మాన్(21), అబిద్(18), ఆరిఫ్​ ఉల్లా(22), ఫర్వాలేదనిపించారు. మహ్మద్ రెస్వే హసన్(1*) పరుగులు చేశాడు. లలిత్​ మీనా, అజిత్​ కుమార్​ రెడ్డి చెరో వికెట్​ చొప్పున పడగొట్టారు.

Last Updated : Dec 17, 2022, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.