ETV Bharat / sports

Dhoni: ధోనీకి నిద్రలో ఎప్పుడూ అదే కలవరింత!

తన భర్త, టీమ్​ఇండియా మాజీ సారథి ధోనీకి(Dhoni) ప్లేస్టేషన్​, పబ్​జీ ఆడటమంటే ఎంతో ఇష్టమని చెప్పిన సాక్షి.. మహీ నిద్రలో కూడా పబ్జీ గురించే ఎక్కువగా కలవరిస్తున్నాడని తెలిపింది.

dhoni
ధోనీ
author img

By

Published : Jul 5, 2021, 4:52 PM IST

టీమ్​ఇండియా మాజీ సారథి ధోనీకి(Dhoni) వీడియో గేమ్స్​ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖాళీ దొరికినప్పుడల్లా సహచర ఆటగాళ్లతో ప్లేస్టేషన్​ లేదా పబ్​జీ ఆడుతూ కనిపిస్తుంటాడు. అయితే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మహీ గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పింది అతడి భార్య సాక్షి. నిద్రలో కూడా పబ్జీనే ఎక్కువగా కలవరిస్తాడని తెలిపింది.

"మహీ మెదడు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. ఆసలు విశ్రాంతి ఉండదు. కాల్​ ఆఫ్​ డ్యూటీ, పబ్​జీ లేదా ఇతర ఆటలు ఆడినప్పుడు ఆ ఆలోచనల నుంచి బయటపడటానికి అవి సహాయపడతాయని అనుకుంటాను. పబ్​జీ నా బెడ్​రూమ్​లోకి కూడా వచ్చేసింది. నాతో ఉన్నప్పటికీ, హెడ్​ఫోన్స్ పెట్టుకొని ఇతర ప్లేయర్లతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో నిద్రలో కూడా ఈ ఆటగురించే ఎక్కువగా కలవరిస్తున్నాడు."

-సాక్షి, మహీ భార్య.

జులై 4న ఈ జంట దాంపత్యానికి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సాక్షి.. మహీ గురించి పలు విశేషాలను చెప్పింది. ఇందులో భాగంగానే పై విషయాన్ని వెల్లడించింది. దానికి సంబంధించిన వీడియోను చెన్నైసూపర్​కింగ్స్​ ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది. ఈ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన భార్యకు ప్రత్యేకంగా ఓ వింటేజ్​ కారను బహుమతిగా ఇచ్చాడు మహీ.

dhoni
భార్యకు ధోనీ స్పెషల్​ గిఫ్ట్​

ఇదీ చూడండి:

Dhoni: భార్యకు ధోనీ స్పెషల్​ గిఫ్ట్​.. ఏంటంటే?

అలా ధోనీ, సాక్షి ప్రేమలో పడ్డారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.