న్యూజిలాండ్ కెప్టెన్, గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓ సిక్సర్‌ను ఆపబోయి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి మోకాలికి తీవ్ర గాయమైంది. దీంతో మెగాటోర్నీకి దూరమైన విలియమ్సన్ స్వదేశానికి బయలుదేరాడు. అయితే ఇప్పుడు కేన్ మామకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. ఇందులో మామ.. మోకాళ్లకి కట్టుతో.. క్రట్చెస్ (ఊత కర్రలు) సాయంతో నడుస్తూ కనిపించాడు. మైదానంలో ఎంతో యాక్టివ్‌గా ఉండే విలియమ్సన్ ఇలా కర్రలు పట్టుకుని నడవడంపై అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ వీడియో చూస్తుంటే కేన్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని అనిపిస్తోంది. ఎక్కువ రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు కూడా సూచించారట. దీంతో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్-2023లో విలియమ్సన్ ఆడటాడా లేదా అనేది ప్రస్తుతం అనుమానంగా మారింది.
కాగా, గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన కేన్ విలియమ్సన్‌కు భారత్‌లో చాలా మందే అభిమానులు ఉన్నారు. అందుకే తన స్వదేశం న్యూజిలాండ్‌కు వెళ్లేముందే సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌కు ఓ ఎమోషనల్ మెసేజ్ పోస్ట్ చేశాడు. క్రచెస్ సాయంతో నిలబడి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. "థ్యాంక్యూ గుజరాత్ టైటాన్స్. ఈ కొద్ది రోజుల్లోనే చాలా మంది అద్భుతమైన ప్లేయర్స్‌ను కలిశాను. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను తిరిగి స్వదేశానికి వెళ్తున్నా. త్వరలో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తాను" అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. కేన్ వీలైనంత త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అలాగే విలియమ్సన్ పోస్టుపై శిఖర్ ధావన్, సురేశ్ రైనా, రుతురాజ్ గైక్వాడ్, డేవిడ్ వార్నర్ తదితర క్రికెటర్లు కూడా స్పందించారు. త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెట్టారు.
ఇక గుజరాత్ టైటాన్స్ విషయానికొస్తే.. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఈ జట్టు.. గత ఏడాది తమ ఆరంభ సీజన్లోనే ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ప్రస్తుత సీజన్లో వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ఏప్రిల్ 4న దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ కుప్పకూలినా.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సుదర్శన్ అద్భుతంగా రాణించడంతో విజయాన్ని దక్కించుకుంది. పాయింట్ల పట్టికలోనూ అగ్రస్థానంలో నిలిచింది.
-
#WATCH: Hear Kiwi cricketer Kane Williamson's first comments as he touches down in NZ, after a knee injury cut short his @IPL campaign https://t.co/j8QZegWvcu (Via @AlexChapmanNZ) pic.twitter.com/5GUnkugHXa
— Newshub (@NewshubNZ) April 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH: Hear Kiwi cricketer Kane Williamson's first comments as he touches down in NZ, after a knee injury cut short his @IPL campaign https://t.co/j8QZegWvcu (Via @AlexChapmanNZ) pic.twitter.com/5GUnkugHXa
— Newshub (@NewshubNZ) April 3, 2023#WATCH: Hear Kiwi cricketer Kane Williamson's first comments as he touches down in NZ, after a knee injury cut short his @IPL campaign https://t.co/j8QZegWvcu (Via @AlexChapmanNZ) pic.twitter.com/5GUnkugHXa
— Newshub (@NewshubNZ) April 3, 2023
ఇదీ చూడండి: IPL 2023: ఆరెంజ్ క్యాప్ రేస్.. రుతురాజ్, కైల్ మేయర్స్ దూకుడు.. మరి కోహ్లీ?