Hasan Raza Sensational Comments On BCCI : వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్ఇండియాపై సెన్సెషనల్ కామెంట్స్ చేశాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా. బీసీసీఐ, ఐసీసీ ఇద్దరు కలిసి భారత బౌలర్లకు స్పెషల్ బాల్స్ అందిస్తున్నారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. అందుకే టీమ్ఇండియా పేసర్లు, స్పిన్నర్లు మైదానంలో ఈ రకంగా చెలరేగిపోతున్నారు అంటూ పాక్‌కు చెందిన ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు. ఈ వ్యవహారంపై ఐసీసీ విచారణ జరిపించాలని సూచించాడు ఈ మాజీ ఆటగాడు.
"భారత్ వేదికగా జరుగుతున్న 2023 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా మ్యాచ్‌లు, వరుసగా వారు సాధిస్తున్న విజయాలు చూస్తుంటే బహుశా థర్డ్ అంపైర్ లేదా బీసీసీఐ లేదా ఐసీసీ భారత బౌలర్లకు స్పెషల్ బాల్స్ ఇస్తుందా అని అనిపిస్తుంది. ఇదంతా నాకో చీటింగ్లా అనిపిస్తుంది. మిగతా జట్ల బౌలర్లతో పోలిస్తే భారత బౌలర్లకు ఎక్కువ స్వింగ్ లభిస్తోంది. డీఆర్ఎస్, ఎల్బీడబ్ల్యూ నిర్ణయాలు కూడా టీమ్ఇండియాకు అనుకూలంగా వస్తున్నాయి. దీనిపై ఐసీసీ విచారణ జరిపించాలి."
- హసన్ రజా, పాక్ మాజీ ఆటగాడు
-
Former Pakistan cricketer Hasan Raza says the ICC or BCCI is giving different balls to Indian bowlers, and that's why they are taking wickets. He wants this issue to be investigated 😱 #INDvSL #INDvsSL #CWC23 pic.twitter.com/2ThsgYDReg
— Farid Khan (@_FaridKhan) November 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Former Pakistan cricketer Hasan Raza says the ICC or BCCI is giving different balls to Indian bowlers, and that's why they are taking wickets. He wants this issue to be investigated 😱 #INDvSL #INDvsSL #CWC23 pic.twitter.com/2ThsgYDReg
— Farid Khan (@_FaridKhan) November 2, 2023Former Pakistan cricketer Hasan Raza says the ICC or BCCI is giving different balls to Indian bowlers, and that's why they are taking wickets. He wants this issue to be investigated 😱 #INDvSL #INDvsSL #CWC23 pic.twitter.com/2ThsgYDReg
— Farid Khan (@_FaridKhan) November 2, 2023
ఫ్యాన్స్ ఫైర్..
మరోవైపు హసన్ రజా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధం ఎదుర్కొంటున్న హసన్ రజా బీసీసీఐ చీటింగ్ చేస్తుందంటూ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని కొందరు క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతుంటే మరికొందరు జోక్స్ వేస్తున్నారు. 'భారత్ సాధిస్తున్న వరుస విజయాలు హసన్ రజాకు మింగుడుపడటం లేదనుకుంటా, పాక్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది' అంటూ ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు.
ఇక సొంత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో రోహిత్ సేన విజయ దుందుభి మోగిస్తూనే ఉంది. ఈ టోర్నీలో భారత్ కేవలం బ్యాటర్ల మీదే ఆధారపడటం లేదు. బౌలింగ్‌లోనూ సత్తా చూపిస్తుంది. ముఖ్యంగా పేస్ త్రయం మహ్మద్ షమీ, సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాతో పాటు కుల్దీప్ యాదవ్‌లను అదను చూసుకొని బౌలింగ్‌కు పంపుతుంది. ఇలా బౌలింగ్‌కు వచ్చిన ప్రతిఒక్కరూ తమ మార్క్‌ను సృష్టించుకుంటున్నారు. అసాధారణ వికెట్స్ పడగొడుతూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
కేవలం పేస్ బౌలింగ్ మాత్రమే కాకుండా స్పిన్నర్లు స్పిన్‌తో మిగతా బౌలర్లు స్వింగ్, బౌన్స్‌లతో ప్రత్యర్థి బ్యాటర్లకు పగలే చుక్కలు చూపిస్తున్నారు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వంటి జట్లను 200 మార్క్‌ను కూడా దాటనివ్వకుండా చేశారు భారత బౌలర్లు. అలాగే ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లను కూడా తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారు. ఇక గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టును 19.4 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూల్చింది.
వరుస విజయాలతో భారత్ కొత్త రికార్డు - అప్పుడు 8, ఇప్పుడు 7!
'ప్రతి ఒక్కరిపై నాకు నమ్మకం ఉంది అందుకే ఆ నిర్ణయాన్ని వారికే వదిలేశాను'