ETV Bharat / sports

పాక్​ బౌలర్లకు కెరీర్​ అత్యుత్తమ ర్యాంకులు

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో పాకిస్థాన్​ ఆటగాళ్లు పలువురు కెరీర్​ అత్యుత్తమ ర్యాంకుల్ని కైవసం చేసుకున్నారు. ​ఇటీవల జరిగిన జింబాబ్వే సిరీస్​లో అద్భుత ప్రదర్శనే ఇందుకు కారణం.

Hasan, Nauman and Shaheen
హసన్​ అలీ, నౌమన్​ అలీ, షాహీన్ అఫ్రిది
author img

By

Published : May 12, 2021, 6:51 PM IST

Updated : May 13, 2021, 7:03 PM IST

ఐసీసీ​ టెస్టు ర్యాంకింగ్స్​ పురుషుల విభాగంలో పాకిస్థాన్ బౌలర్లు మెరుగుపడ్డారు. ఇటీవల జింబాబ్వే సిరీస్ విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించిన హసన్​ అలీ, నౌమన్​ అలీ, షాహీన్​ అఫ్రిది కెరీర్​లో​ అత్యుత్తమ ర్యాంకులకు చేరుకున్నారు. ​

హాసన్​ ఆరు, షాహీన్​ తొమ్మిది, నౌమాన్​ ఆరు స్థానాలను ఎగబాకి వరుసగా 14, 22, 46వ ర్యాంకులకు చేరుకున్నారు. బ్యాట్స్​మెన్​లో పాక్​కు చెందిన అబిద్​ అలీ 40, అజ్హర్​ అలీ 16 , నౌమన్​116వ ర్యాంకుల్లో నిలిచారు.

జింబాబ్వే బ్యాట్స్​మెన్​లో​ రెగిస్ ఏకంగా​ 16 స్థానాలు ఎగబాకి 81వ ర్యాంకుకు, లూక్​ జాంగ్వే 133వ స్థానంలో నిలిచాడు. బౌలర్లు ముజారాబనీ 51, టెండాయ్​ కిసొరో 110వ స్థానంలో నిలిచారు.

మొత్తంగా బ్యాట్స్​మెన్​లో న్యూజిలాండ్​ సారథి కేన్​ విలియమ్స​న్​ అగ్రస్థానాన్ని కాపాడుకోగా, స్మిత్​, లబుషేన్​, రూట్..​ రెండు, మూడు నాలుగు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. బౌలింగ్​ విభాగంలో ప్యాట్ కమిన్స్​(908 పాయింట్లు) తొలి స్థానాన్ని, రవిచంద్రన్​ అశ్విన్​(850) రెండో ర్యాంకును పదిలపరుచుకున్నారు.

ఇదీ చూడండి: ర్యాంకింగ్స్: ఐదులోనే కోహ్లీ- శ్రీలంక కెప్టెన్ కాస్త పైకి

Last Updated : May 13, 2021, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.