ETV Bharat / sports

పాక్​ బౌలర్​ దెబ్బ.. రెండు ముక్కలైన స్టంప్​ - గ్లూస్టర్​ షైర్​

Hasan ali breaks stump: కౌంటీ క్రికెట్​లో పాకిస్థాన్​ ఫాస్ట్​ బౌలర్​ హసన్ అలీ అదరగొట్టాడు. అతడు వేసిన ఓ యార్కర్​ వేగానికి ఏకంగా మిడిల్​ స్టంప్ రెండు ముక్కలైపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది. ​

Hasan Ali Breaks Middle Stump
Hasan Ali Breaks Middle Stump
author img

By

Published : Apr 24, 2022, 2:10 PM IST

Hasan ali breaks stump: కౌంటీ క్రికెట్​లో ఓ అరుదైన సంఘటన జరిగింది. పాకిస్థాన్​ ఫాస్ట్​ బౌలర్​ హసన్ అలీ బౌలింగ్ వేగానికి స్టంప్ రెండు ముక్కలైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది.

మూడు రోజు ఆటలో భాగంగా బౌలింగ్​ వేసిన హసన్​.. గ్లూస్టర్​ షైర్​(Gloucestershire) బ్యాటర్​ జేమ్స్​ బ్రేసీని క్లీన్​బౌల్డ్​ చేశాడు. దాదాపు 150కి.మి వేగంతో యార్కర్​ను విసరగా అది కాస్త బ్యాటర్​ కాళ్ల సందుల నుంచి వెళ్లి మిడిల్​ స్టంప్​ను ఎగురగొట్టింది. అయితే బంతి సూపర్​ ఫాస్ట్​తో రావడం వల్ల స్టంప్​ రెండు ముక్కలైంది. దీనికి సంబంధించిన వీడియోను లంకాషైర్​(Lancashire) ట్విట్టర్​లో షేర్​ చేసింది. "కొత్త స్టంప్​ కావాలి.. ఓ మై వర్డ్​.. మేము ఇంకో స్టంప్​ను తెప్పించుకోవాల్సిందే" అంటూ వ్యాఖ్య రాసుకొచ్చింది.

కాగా, ఈ మ్యాచ్​లో లంకాషైర్​కు ప్రాతనిధ్యం వహిస్తున్న హసన్​ అలీ తొలి ఇన్నింగ్స్​లో ఆరు వికెట్లను తీశాడు. దీంతో గ్లూస్టర్​షైర్ 252 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా.. తొలి ఇన్నింగ్స్​లో 556 పరుగుల వద్ద డిక్లేర్​ చేసిన లంకాషైర్​కు 304 పరుగుల ఆధిక్యం లభించింది. జోష్​ బొహానన్​(231) డబుల్​ సెంచరీతో మెరవగా, కెప్టెన్​ డేన్​ విలాస్​(109) సెంచరీతో అదరగొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్​లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి గ్లూస్టర్​ షైర్​ మూడు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది.

ఇదీ చూడండి: IPL: ఆర్సీబీ పేలవ రికార్డు.. టాప్​-10లోని నాలుగు స్థానాల్లో ఈ జట్టే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.