టీ20 ప్రపంచకప్(hardik pandya latest news) పూర్తి చేసుకుని దుబాయ్ నుంచి ముంబయి వచ్చిన టీమ్ఇండియా క్రికెట్ హార్దిక్ పాండ్యాకు కస్టమ్స్ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. అతడి దగ్గర నుంచి రూ.5 కోట్లు విలువ చేసే రెండు వాచీలను స్వాధీనం చేసుకున్నారు(hardik pandya customs). ఈ వాచీలకు సంబంధించిన బిల్ హార్దిక్ వద్ద లేదని అధికారులు తెలిపారు.
ఐపీఎల్, టీ20 ప్రపంచకప్(T20 worldcup 2021 news) కోసం దుబాయ్ వెళ్లాడు హార్దిక్ పాండ్య. దాదాపు మూడు నెలలపాటు టీమ్ఇండియా జట్టు అక్కడే ఉంది. ఇటీవల పొట్టి ప్రపంచకప్ పూర్తయిన నేపథ్యంలో ఆటగాళ్లు అక్కడి నుంచి స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన హార్దిక్ వద్ద ఖరీదైన వాచీలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
స్పందించిన హార్దిక్
సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారాన్ని ఖండించాడు హార్దిక్(Hardik pandya latest news). దుబాయ్ నుంచి చట్టబద్ధంగానే వాచ్‌లు కొన్నానని హార్దిక్ పాండ్యా ట్వీట్ చేశాడు. "దుబాయ్ నుంచి తీసుకొచ్చిన వస్తువులపై పన్నులు చెల్లించా. కస్టమ్స్ అధికారులు అడిగిన అన్ని పత్రాలు సమర్పించా. కస్టమ్స్ అధికారులు లెక్కగట్టిన పన్ను మొత్తాన్ని చెల్లించా. చేతిగడియారం విలువ కోటిన్నరే. రూ.5 కోట్లు కాదు. దేశ పౌరుడిగా ప్రభుత్వ సంస్థలను అత్యంత గౌరవిస్తా. ఆధారాలు లేకుండానే నాపై దుష్ప్రచారం చేయడం బాధాకరం." అని హార్దిక్ వివరించాడు.
![hardik](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13645666_hardik.jpg)
ఇదీ చూడండి: నేటి నుంచే ఇండోనేసియా మాస్టర్స్.. టైటిల్పై సింధు గురి