ETV Bharat / sports

హార్దిక్​పై ఆ నమ్మకం ఉంది.. కానీ: గంభీర్ - హార్దిక్ పాండ్యా లేటెస్ట్ న్యూస్

టీమ్ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా(hardik pandya news) ఫిట్​నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడు. దీంతో అతడిని కివీస్​తో టీ20 సిరీస్​కు జట్టులోకి తీసుకోలేదు యాజమాన్యం. దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్ గంభీర్(gautam gambhir on hardik pandya).. పాండ్యా తప్పకుండా మళ్లీ టీ20 జట్టులోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Hardik
హార్దిక్​
author img

By

Published : Nov 20, 2021, 8:59 PM IST

టీమ్ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా(hardik pandya news) ఫిట్‌నెస్‌, తిరిగి జట్టులో చోటు దక్కించుకోవడంపై చర్చ కొనసాగుతూనే ఉంది. వెన్నునొప్పితో బాధపడిన హార్దిక్‌ ఐపీఎల్‌లోనూ, టీ20 ప్రపంచకప్‌లోనూ బౌలింగ్ చేయలేదు. స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా మాత్రమే సేవలందించాడు. అయితే బ్యాటింగ్‌లోనూ పెద్దగా రాణించిందేమీ లేదు. టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి ఎంపిక చేసిన సందర్భంగా చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ మాట్లాడుతూ.. హార్దిక్‌(hardik pandya news) బౌలింగ్‌ చేస్తాడని పేర్కొన్నాడు. అయితే బౌలింగ్ చేయకపోగా.. బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో కివీస్‌తో మూడు టీ20ల సిరీస్‌కు హార్దిక్‌ను జట్టు సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యాకు మాజీ క్రికెటర్‌, ఎంపీ గౌతమ్‌ గంభీర్‌(gautam gambhir on hardik pandya) బాసటగా నిలిచాడు. హార్దిక్‌ తప్పకుండా టీ20 జట్టులోకి వస్తాడనే ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే హార్దిక్‌(hardik pandya news) తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవాలని, బౌలింగ్ చేయగలగాలని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ హార్దిక్‌ ప్లేస్‌ను భర్తీ చేస్తే.. ఆ ఆటగాళ్లకు కుదురుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని, అప్పుడే వారేంటో తెలుసుకోవచ్చని గంభీర్‌ పేర్కొన్నాడు.

"జట్టులోని ఆరో స్థానం (హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌ ఆర్డర్)లో ఆటగాడి మార్పు ఒక్క రోజులో అయ్యేది కాదు. హార్దిక్‌(hardik pandya news)ను పరిగణనలోకి తీసుకోకుండా ఉండలేం. ఒకవేళ హార్దిక్‌ ఫిట్‌నెస్ సాధించి రెగ్యులర్‌గా బౌలింగ్ చేస్తే మాత్రం జట్టులోకి వచ్చేందుకు తప్పకుండా అవకాశాలు ఇవ్వాలి. ఇప్పటికీ అతడు యువకుడే కావడం మరో సానుకూలాంశం" అని గంభీర్‌(gautam gambhir on hardik pandya) విశ్లేషించాడు.

అలాగే ఇతర ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తే మాత్రం ఎక్కువ సమయం ఇవ్వాలని పేర్కొన్నాడు గంభీర్(gautam gambhir news). అప్పుడే సదరు ఆటగాడి సామర్థాన్ని అంచనా వేసేందుకు వీలు కలుగుతుందని చెప్పాడు. ప్రతి సిరీస్‌కూ జట్టును మారుస్తూ ఉంటే మాత్రం.. తుది 11 మందిని ఎంచుకోవడానికి ఇబ్బంది పడాల్సి ఉంటుందని వివరించాడు. ప్రస్తుతం ప్రతి ఆటగాడికి ప్రత్యామ్నాయం ఉన్నందున జట్టులో ఎవరూ శాశ్వతం కాదని స్పష్టం చేశాడు. అయితే ఆటగాళ్లకు మన క్రికెట్‌ బోర్డు అండగా నిలవాలని గంభీర్‌ సూచించాడు.

ఇవీ చూడండి: మరోసారి ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్​గా స్మిత్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.