ETV Bharat / sports

హార్దిక్ భావోద్వేగం.. ముంబయి ఇండియన్స్​ను మరవలేనంటూ..!

Hardik Pandya news: హార్దిక్‌ పాండ్యకు రిటెయిన్‌ ఆటగాళ్ల జాబితాలో చోటుదక్కలేదు. ఈ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్‌తో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ హార్దిక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్టు చేశాడు.

Hardik Pandya news
హార్దిక్ పాండ్య న్యూస్​
author img

By

Published : Dec 3, 2021, 6:05 AM IST

Hardik Pandya updates: టీమ్​ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య ముంబయి ఇండియన్స్‌కు భావోద్వేగపూరితంగా వీడ్కోలు పలికాడు. 28 ఏళ్ల హార్దిక్.. 2015లో ముంబయి ఇండియన్స్‌కు ఆడటం ప్రారంభించిన తర్వాత వెలుగులోకి వచ్చాడు. ఎన్నోసార్లు ఒంటిచేత్తో విజయాలనందించి జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. అయితే, ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్‌లను ఆ జట్టు రిటెయిన్‌ చేసుకుంది. హార్దిక్‌ పాండ్యకు రిటెయిన్‌ ఆటగాళ్ల జాబితాలో చోటుదక్కలేదు. ఈ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్‌తో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ హార్దిక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్టు చేశాడు.

'ముంబయి ఇండియన్స్‌తో నా ప్రయాణం.. ఈ జ్ఞాపకాలను, క్షణాలను నా జీవితాంతం నాతో పాటు ఉంచుకుంటాను. నేను చేసిన స్నేహాలు, ఏర్పడిన బంధాలు, ప్రజలు, అభిమానులకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. నేను ఆటగాడిగా మాత్రమే కాకుండా వ్యక్తిగా ఎదిగాను. నేను యువకుడిగా పెద్ద కలలతో వచ్చాను. మేము కలిసి గెలిచాం, కలిసి ఓడిపోయాం, కలిసి పోరాడాం. ఈ టీమ్‌తో నేను గడిపిన ప్రతి క్షణానికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎంత గొప్ప బంధాలకైనా ముగింపు ఉంటుందని అంటుంటారు. కానీ, ముంబయి ఇండియన్స్‌ ఎప్పటికీ నా హృదయంలో ఉంటుంది' అని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్టు చేస్తూ హార్దిక్ రాసుకొచ్చాడు.

ఇదీ చదవండి:IND vs NZ test: తుది జట్టులో ఎవరికి దక్కేనో అవకాశం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.