ETV Bharat / sports

T20 worldcup: 'కోహ్లీ తప్ప ఆ పని ఇంకెవరూ చేయలేరు'

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ, హార్దిక్​ పాండ్యా కలిసి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారంటే..

hardik praises on kohli
కోహ్లీపై హార్దిక్ ప్రశంసలు
author img

By

Published : Oct 24, 2022, 11:01 AM IST

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించడంలో స్టార్​ బ్యాటర్​ కోహ్లీ, స్టార్ ఆల్​రౌండర్​ హార్దిక పాండ్య కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ శతక భాగస్వామ్యం నిర్మించారు. అయితే మ్యాచ్‌ అనంతరం విరిద్దరూ ప్రత్యేకంగా ముచ్చటించారు. మ్యాచ్​ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మాట్లాడుకున్నారు.

"హారిస్‌ బౌలింగ్‌లో విరాట్ కొట్టిన ఆ రెండు సిక్స్‌లు చాలా కీలకం. ఒకవేళ అప్పుడు కొట్టకపోతే మ్యాచ్‌ దూరమై ఉండేది. నేను చాలాసార్లు సిక్స్‌లు కొట్టాను.. కానీ విరాట్ బాదిన ఇవి మాత్రం చాలా చాలా ప్రత్యేకం. అవే మమ్మల్ని మ్యాచ్‌ విజయం వైపు నడిపించాయి. చాలా మంది క్రికెటర్లతో ఆడా. అయితే ఇలాంటి రెండు షాట్లు మాత్రం కోహ్లీ తప్పించి మరెవరూ కొట్టినట్లు నాకైతే గుర్తు లేదు. ఇక మ్యాచ్‌లో అత్యుత్తమం ఏంటంటే తీవ్రంగా ఇబ్బందిపడి గెలుపు శిఖరాలకు చేరాం. ఆ అనుభూతి కూడా అద్భుతం. ఛేదన సందర్భంగా మనం ఇద్దరం (కోహ్లీతో) మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే ఇక్కడ పాక్‌ బౌలర్లను తక్కువగా అంచనా వేయకూడదు. వారు చాలా బాగా బౌలింగ్‌ చేశారు"

"మ్యాచ్‌ సందర్భంగా డ్రెస్సింగ్‌ రూమంతా తీవ్ర ఒత్తిడిలో ఉంది. నాకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే నేను పెద్ద మ్యాచ్‌లో ఉన్నా. అయితే నావరకైతే ఎందుకో తెలియదు గ్రౌండ్‌లోకి వచ్చేసరికి నా మైండ్‌ మొద్దుబారిపోయింది. ఇదే నేను కోరుకుంది. ఇక్కడ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. మన జట్టుతో ఉన్న బంధం అద్భుతం. ఇక కీలక సమయంలో నేను రిస్క్‌ తీసుకొన్నా. ఒత్తిడి రాకుండా ఉండేందుకు చూశా. నా లక్ష్యం చాలా సింపుల్‌. జీవితం సులభతరం కావడానికి ఏం చేయాలో దానిని చేయడానికి సిద్ధంగా ఉంటా. ఇలా చాలాసార్లు నువ్వు (కోహ్లీ) చేశావు. నీకంటే ఒత్తిడిని హ్యాండిల్‌ చేయగల సమర్థులు మరొకరు లేరు" అని హార్దిక్‌ ప్రశంసించాడు.

ఇదీ చూడండి: ఆ ఎన్నికలకూ దూరం.. కొత్త ఇన్నింగ్స్ అంటూ మరో ట్విస్ట్.. గంగూలీ ప్లాన్ ఏంటో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.