ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం శుక్రవారం 24 మందితో కూడిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది బీసీసీఐ. అందులో హార్దిక్ పాండ్య, పృథ్వీషా, భువనేశ్వర్ కుమార్ లాంటి కీలక ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన టీమ్ఇండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్‌చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ టెస్టుల్లో కొనసాగడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు తీసుకోకపోవడం కఠిన నిర్ణయమని పేర్కొన్నాడు.
"డబ్ల్యూటీసీ ఫైనల్లో హార్దిక్ లేకపోయినప్పటికీ ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్‌లోనూ అతడు ఉండకపోవడం ఆలోచించాల్సిన విషయం. కాబట్టి అతడు ఎక్కువ కాలం టెస్టుల్లో కొనసాగకపోవచ్చని దీని ఆధారంగా తెలుస్తోంది. హార్దిక్‌కు కచ్చితంగా చోటు ఉంటుందని భావించాం. అయితే భవిష్యత్‌లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలో టెస్టులు ఆడినప్పుడు అతడిని మీడియం పేసర్‌గా తీసుకోవాల్సి వస్తుంది. కానీ అతడు బౌలింగ్ చేయలేకపోతున్నాడు. అతడిపై ఒత్తిడి తగ్గించేందుకు టెస్టు క్రికెట్‌కు దూరం చేస్తున్నట్లు అంతకుముందు సారథి కోహ్లీ కూడా చెప్పాడు. కాబట్టి అతడి టెస్టుకెరీర్పై ప్రభావం పడొచ్చు. వ్యక్తిగతంగా చెప్పాలంటే కుల్దీప్ యాదవ్‌కూ చోటివ్వకపోవడం కఠినం. అతడు ఎక్కువ క్రికెట్ ఆడలేదనడం బాధాకరం. ఇంగ్లాండ్ టెస్టు సిరీసులో అతడొకే మ్యాచు ఆడాడు. కొన్ని వికెట్లు తీశాడు. గులాబి టెస్టూ ఆడలేదు. ఇప్పుడు టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనలే కాదు ఏకంగా ఇంగ్లాండ్ సిరీసు మొత్తానికీ ఎంపికవ్వలేదు. కొవిడ్ పరిస్థితుల్లో ఎక్కువ మందితో జట్లను ప్రకటించే సౌలభ్యం దొరికింది. అలాంటప్పుడు కుల్‌దీప్‌కు ఎందుకు చోటివ్వకూడదు. నిజమే, ఇప్పుడు అశ్విన్, జడేజా, సుందర్, అక్షర్ పటేల్ రూపంలో నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. కానీ వారంతా ఫింగర్ స్పిన్నర్లు. మణికట్టు స్పిన్నర్ల బౌలింగ్‌లో ఇబ్బందిపడే ప్రత్యర్థి ఉన్నప్పుడు కుల్దీపన్ ఎందుకు తీసుకోకూడదు""
-ఆకాశ్ చోప్రా, కామెంటేటర్.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జూన్ 18 నుంచి ప్రారంభమవుతుండగా.. ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆగస్టు 4న మొదలుకానుంది. ఇందుకోసం భారత ఆటగాళ్లు జూన్ 2న ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నారు.
ఇదీ చూడండి: డబ్ల్యూటీసీ ఫైనల్: వీరిని పక్కనపెట్టింది అందుకేనా?