Hardik pandya marriage video : ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే.. ఉండే సందడే వేరు. బంధువులు, స్నేహితులు, ఆత్మీయుల ఇలా మనకు కావాల్సిన వారితో ఇళ్లంతా సందడి వాతవరణంగా ఉంటుంది. ఆటపాటలు.. వదినా మరదళ్లు.. బావా బామ్మర్దుల సరదాలు.. అబ్బో ఇలాంటివి చాలానే ఉంటాయి. టీమ్‌ఇండియా స్టార్ ఆల్‌రౌండర్, భవిష్యత్ కెప్టెన్‌గా ఎదుగుతున్న హార్దిక్ పాండ్యా వివాహ వేడుకల్లోనూ ఇలాంటి సన్నివేశాలెన్నో మరెన్నో ఉన్నాయి. అయితే పెళ్లి వేడుకలో వధూవరులను బంధువులు ఆటపట్టిస్తారన్న సంగతి తెలిసిందే. టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వివాహ వేడుకలోనూ ఇలాంటి ఓ సరదా సన్నివేశం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
అదేంటంటే.. సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్‌ను టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. 2020లో లాక్‌డౌన్ కారణంగా ఈ జంట సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే అప్పటికే నటాషా గర్భవతి కూడా. ఈ క్రమంలో అదే ఏడాది 2020 జులైలో నటాషా ఓ పండంటి మగబిడ్డకు కూడా జన్మనిచ్చింది. అలా తొలుత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట.. 2023 ఫిబ్రవరి 14.. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆత్మీయులు, బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయబద్దంగా మరోసారి గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది.
ఈ వేడుకలో హార్దిక్ పాండ్యా వదిన, కృనాల్ పాండ్య భార్య ఫాంకురి శర్మ.. 'జుతా చురాయి'(పాదరక్షలు దాచిపెట్టడం) అంటూ మరిది హార్దిక్ షూస్‌ను దాచిపెట్టి ఆట పట్టించింది. రూ. లక్ష రూపాయలు ఇస్తేనే వాటిని తిరిగి ఇస్తానంటూ ఫుల్‌గా ఆట పట్టించింది. అయితే అప్పుడు హార్దిక్.. 'లక్ష కాదు.. ఐదు లక్షలు ఇస్తా' అంటూ వదినమ్మకు చెప్పాడు. అంతే కాకుండా వెంటనే వదిన అకౌంట్‌కు డబ్బు పంపమని పక్కనున్న బంధువులకు చెప్పాడు. అయినా సరే వదినమ్మ ఫాంకురి శర్మ.. హార్దిక్‌ను ఆటపట్టిస్తూనే ఉన్నారు. డబ్బు మొత్తం పంపిస్తేనే షూస్ ఇస్తానని అన్నారు. అలా సరదా సాగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
Ameeri ho to aisi ho. Hardik Pandya jitna ameer hona hai life me pic.twitter.com/qyHvfkxFWq
— CS Rishabh (Professor) (@ProfesorSahab) June 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ameeri ho to aisi ho. Hardik Pandya jitna ameer hona hai life me pic.twitter.com/qyHvfkxFWq
— CS Rishabh (Professor) (@ProfesorSahab) June 18, 2023Ameeri ho to aisi ho. Hardik Pandya jitna ameer hona hai life me pic.twitter.com/qyHvfkxFWq
— CS Rishabh (Professor) (@ProfesorSahab) June 18, 2023
ఇక హార్దిక్ కెరీర్ విషయానికి వస్తే..ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా ఈ సీజన్లో తమ జట్టును ఫైనల్స్ వరకు చేర్చాడు. కానీ ఆఖరి మెట్టులో జరిగిన హోరా హోరీ పోటీలో చెన్నై సూపర్‌కింగ్స్ చేతిలో ఓటమిని చవి చూశారు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ ఈసా రి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
ఇదీ చూడండి :
Hardik Pandya Watch Collection : హార్దిక్ వార్డ్‌రోబ్‌లో రూ. 2 కోట్ల వాచ్.. ఇంకా ఎన్ని ఉన్నాయంటే ?
హిందూ సంప్రదాయంలోనూ హార్దిక్ మరోసారి పెళ్లి.. ఫోటోలు ఎంత బాగున్నాయో!