Hardik Pandya Injury Update World Cup 2023 : టీమ్ఇండియా క్రికెట్ అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్ అందింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య రెండు మ్యాచ్‌లకే కాకుండా టోర్నీ మొత్తానికి దూరమయ్యే ఛాన్స్ ఉందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అతడి గాయం అనుకున్నదాని కన్నా తీవ్రంగా ఉందని తెలుస్తోంది.
మొదట ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌తో స్పెషలిస్ట్ బ్యాటర్‌గానైనా ఆడతాడని అంతా ఆశించారు. కానీ అతడి విషయంలో మేనేజ్‌మెంట్ రిస్క్ తీసుకోకూడదని మరో రెండు మ్యాచ్‌లకు రెస్ట్ కల్పించాలని నిర్ణయించింది. అయితే, ఇప్పుడు చీలమండ గాయమని భావించినప్పటికీ.. లిగమెంట్(అస్థిబంధనం)లోనూ చీలిక బయటపడినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ కథనాలే నిజమైతే హార్దిక్‌కు కనీసం నాలుగు వారాల రెస్ట్ అవసరం ఉంటుంది. అప్పుడు ఈ టోర్నీలోని మిగిలిన మ్యాచ్‌లకూ అతడు దూరమయ్యే ఛాన్స్ ఉంది. అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటన లేదు.
అసలేం జరిగిందంటే..
Hardik Pandya Injury : పుణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన బౌలింగ్‌లోనే ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు హర్దిక్ పాండ్య కింద పడ్డాడు. ఆ సమయంలో చీలమండకు గాయమైంది. దీంతో ధర్మశాలలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు పాండ్య దూరమయ్యాడు. ప్రస్తుతం హర్దిక్ పాండ్య బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) పర్యవేక్షణలో చిక్సిత తీసుకుంటున్నాడు. అక్టోబర్ 29న లఖ్‌నవూలో ఇంగ్లాండ్, నవంబరు 2న ముంబయిలో శ్రీలంకతో భారత్ తలపడనుంది.
Hardik Pandya World cup 2023 : ఒకవేళ హార్దిక్ పాండ్య టోర్నీకే దూరమైతే.. అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. పేస్ ఆల్‌రౌండర్ పాత్రను పోషించే ఆటగాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. వీరిలో దీపక్ చాహర్, శివమ్ దూబే నయంగా కనిపిస్తున్నారు. ఇక స్పిన్ ఆల్‌రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్ ఉండనే ఉన్నారు. ఇప్పటికే జట్టులో స్పిన్ ఆల్‌రౌండర్లు ఇద్దరు ఉన్నారు. ఈ నేపథ్యంలో హర్దిక్ గాయంపై బీసీసీఐ ఏమి చెబుతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
Hardik pandya World Cup 2023 : బిగ్ షాక్.. మరో రెండు మ్యాచ్‌లకూ హార్దిక్ దూరం..
Hardik Pandya Injury Replacement : హార్దిక్ స్థానంలో ఛాన్స్ ఎవరికో! సెలెక్టర్ల మొగ్గు వారివైపేనా?