ETV Bharat / sports

క్రికెటర్ హార్దిక్ పాండ్య వాచ్ ఖరీదు అన్ని కోట్లా? - హార్దిక్ పాండ్య లేటెస్ట్ న్యూస్

టీమ్​ఇండియా యువ ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్య వాచ్ ఖరీదు ప్రస్తుతం హాట్​ టాపిక్​గా మారింది. అన్ని కోట్ల రూపాయల ఖరీదా? అని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

Hardik Pandya
హార్దిక్ పాండ్య
author img

By

Published : Aug 26, 2021, 2:35 PM IST

భారత ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య.. ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు. దానికి కారణం అతడు ధరించిన వాచ్​. కోట్ల రూపాయల విలువైన ఈ చేతి గడియారం గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ దీని సంగతేంటి?

ప్రస్తుతం ఐపీఎల్​ రెండో దశ కోసం సిద్ధమవుతున్న హార్దిక్.. యూఏఈలో ఇటీవల జట్టుతో పాటు అడుగుపెట్టాడు. అబుదాబిలోని ఉన్న ఇతడు.. స్నేహితుడుతో కలిసి బయటకెళ్లాడు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోల్ని పోస్ట్ చేశాడు. వాటిలో ఉన్న వాచ్​ ఫొటో నెటిజన్లను తెగ ఆకర్షించింది. దాని ధర తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

పచ్చ రత్నాలు పొదిగి ఉన్న ఆ చేతి గడియారం ఖరీదు రూ.5 కోట్ల పైమాటే అని తెలుస్తోంది. దీంతో అవాక్కవడం నెటిజన్ల వంతైంది.

సెప్టెంబరు 19 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ రెండోదశలో తొలి మ్యాచ్​ చెన్నై సూపర్​కింగ్స్-ముంబయి ఇండియన్స్ మధ్య జరగనుంది. ఆ తర్వాత యూఏఈలో టీ20 ప్రపంచకప్​ కూడా జరగనుంది. అందులోనూ టీమ్​ఇండియా తరఫున పాల్గొనే అవకాశం హార్దిక్ పాండ్యకు ఉంది.​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.